Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్, సీపీఐ పొత్తు పొడిసేసింది.. కొత్తగూడెంతో పాటు రెండు ఎమ్మెల్సీలు ..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 6

సీపీఎంతోనూ రేవంత్ రెడ్డి చర్చలు ..

తెలంగాణ ( telangana) అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు అంశంపై క్లారిటీ వచ్చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ( congress ) , సీపీఐ ( cpi ) మధ్య పొత్తుల అంశం ఖరారయింది. కాంగ్రెస్‌తో పోత్తులో భాగంగా సీపీఐ కొత్తగూడెం ( kottagudem ) నుంచి పోటీ చేయనుంది. అయితే సోమవారం టీపీసీసీ ( tpcc ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( revanth reddy ) సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీపీఐ నేతలతో రేవంత్ చర్చలు జరిపారు.

Hospital

read also : ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారం..!

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించామని, ఎన్నికల అనంతరం రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించాలని సీపీఐని కోరామని, వారు అందుకు అంగీకరించారని తెలిపారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇదిలావుంటే.. సీపీఎం పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారితోనూ పొత్తుల విషయంలో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు తెలంగాణలో సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. మునుగోడులో కేవలం బీజేపీని ఓడించేందుకే బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. కేంద్రంలో నిరంకుశ పాలన ఉందని, అదేస్థాయిలో తెలంగాణలో కేసీఆర్ పాలన ఉందని వ్యాఖ్యానించారు. సీపీఎంతోనూ కాంగ్రెస్ అవగాహనకు వస్తుందని, భవిష్యత్తులోనూ కాంగ్రెస్‌తో ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.