Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ లో హంగ్ కు అవకాశం లేదు: రేవంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : నవంబర్ 19

కాంగ్రెస్ మేనిఫెస్టోకి కేసిఆర్ రాజముద్ర..

తెలంగాణ ( telangana ) లో హంగ్ వచ్చే అవకాశం లేదని టీపీసీసీ ( tpcc )  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( revanth reddy ) స్పష్టం చేశారు. హంగ్ కు అవకాశం ఉన్నదని సర్వత్రా చర్చలు జరుగుతున్న నేపధ్యంలో ఈ విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో హంగ్ కు ఎలాంటి ఛాన్స్ లేదని, తాము ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో జర్నలిస్టు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో 80 నుంచి 85 సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

read also : ఏమున్నదక్కో.. ఏమున్నదక్కా.. హస్తం గూటికి చేరిన రాములమ్మ..

Hospital

కాంగ్రెస్ వేవ్ ఉన్నదని, విజయం సులువుగా వరిస్తుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పతనం ఖాయమన్నారు. కాంగ్రెస్ రాగానే ధరణి దోపిడీపై దర్యాప్తు చేస్తామన్నారు. కల్వకుంట్ల భూముల లెక్కల్ని తేలుస్తామన్నారు. తమ మేనిఫెస్టోను చూసి కేసీఆర్ భయపడుతున్నారని, ఆయనే రాజముద్ర వేయడం సంతోషంగా ఉన్నదన్నారు. ఇక కాంగ్రెస్ లో సీఎం ఎవరనేది అధిష్టానం తేల్చుతుందన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ ను తప్పకుండా అందజేస్తామన్నారు.

read also : ఆరు గ్యారంటీలతో పాటు 37 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ ..

ఎస్సీ వర్గీకరణపై సంపూర్ణ మద్దతు ఉన్నదని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు మందకృష్ణ కార్యచరణ సిద్ధం చేయాలన్నారు. మోడీతో ఆర్డినెన్స్ ఇప్పిస్తే, కాంగ్రెస్ ఒక్క నిమిషం ఆలోచించకుండా మద్దతిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో నక్సలైట్ల ఎజెండాను అమలు చేసిందని, భవిష్యత్లోనూ చేస్తుందన్నారు. ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.