Read News in Telugu Language
adsdaksha

ఆరు గ్యారెంటీలకు రూ.53వేల 196కోట్లు.. బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు పెద్దపీట..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 10

తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. 100 రోజుల్లో 6 హామీలు అమలు చేస్తామని పదే పదే చెబుతున్న ఆ పార్టీ నాయకులు అవి నెరవేర్చేందుకు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రేవంత్ రెడ్డి ( revanth reddy ) ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత దానికే ఇచ్చారు. ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు రూ.53 వేల 196 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

read also : గ్రూప్ 4 ఫలితాలు వచ్చేశాయ్.. 7,26,837 మంది అర్హత సాధించినట్లు వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ ..

Hospital

ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో అంచనా వ్యయాలను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖర్చులను అంచనా వేశారు. ఈ నిధులను బడ్జెట్ లోనే కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు మంత్రి. బడుగు, బలహీన వర్గాలు, మహిళల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. ఆరు గ్యారంటీలను అమలు చేయటం అనేది అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క వివరించారు.

read alsso : కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బీఆర్ఎస్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రసంగం ..

ఈ పథకాల ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని భట్టి అభిప్రాయపడ్డారు. ఆరు గ్యారంటీల్లో.. రెండు గ్యారంటీలను 48 గంటల్లోనే అమలు చేసినట్లు వెల్లడించారాయన. ప్రజా పాలన కింద గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఇప్పటికే 400 కోట్ల రూపాయలు కేటాయించటం జరిగిందని మంత్రి భట్టి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.