Read News in Telugu Language
adsdaksha

సోనియా తెగించి తెలంగాణ ఇచ్చారు .. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి..

దక్ష న్యూస్, హైదరాబాద్ : నవంబర్ 3

6+6 భద్రత పెంచండి : డీజీపీకి రేవంత్ లేఖ..

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు

మీట్ ద ప్రెస్ లో టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ..

తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉందని నమ్మి.. ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా సోనియా గాంధీ ( sonia gandhi ) ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ( revanth reddy ) అన్నారు. ఈ పదేళ్ల పాలనలో కేసీఆర్ ( kcr )  ఏం చెప్పారు.. ఏం చేశారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్ ( hyderabad ) లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ ( meet the press ) లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల అలుపెరగని పోరాటం చూసిన సోనియమ్మ… కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో చచ్చిపోతుందని తెలిసి కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోనియా త్యాగాన్ని తెలంగాణ మరవద్ద అని కోరారు.

read also : 93 ఏళ్ళ బామ్మకు ఇంగ్లీష్ లో పిహెచ్ డి పట్టా..

స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అనే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ధ్వజమెత్తారు.

Hospital

25వ పిల్లర్ నుంచి 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లర్స్ రెండున్నర ఫీట్లు కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారన్నారు. కేసీఆర్ పాలన ఎలా ఉందో యువత, రైతులు, మహిళలను అడిగితే బాగా చెబుతారన్నారు.

ఎన్నికల్లో నిర్దిష్టమైన విధానాలతోనే ప్రజల వద్దకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ఆలోచన చేయాలన్నారు. నిరసనలు తెలపడం వంటి ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆశించిన యువత ఆకాంక్షలు అడియాశలు అయ్యాయని రేవంత్ విమర్శించారు.

read also : దీని భావమేమి చంద్ర శేఖరా.. మండుటెండల్లో ప్రజా ఆశీర్వాద సభలు..

పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన పాత హామీలనే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలన్నారు.

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు సంబంధించి భద్రతపై లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తనకు భద్రతను పెంచాలని ఆయన లేఖలో కోరారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టు చెప్పినా సెక్యూరిటీ కల్పించడం లేదు. హైకోర్టులో మాత్రం 69 మంది సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని పోలీసులు తప్పుడు వాదనలు వినిపించారు. దీనికి తోడుగా గత జూలైలో తనకు ఉన్న 2+2 భద్రతను సైతం వెన్నక్కు తీసుకున్నారు. తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6+6 భద్రత కల్పించాలి. లేనిపక్షంలో కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద కేస్ వేస్తాం అని డీజీపీకి రేవంత్‌ లేఖలో తెలిపారు.

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో తన భద్రతపై రేవంత్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర మంతటా పర్యటించాల్సి రావడంతో తనకు భద్రతను పెంచాలని ఆయన డీజీపీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. కోర్టు ఆదేశాలను మాత్రమే తాను అమలు చేయాలని కోరుతున్నట్లు రేవంత్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.