Read News in Telugu Language
adsdaksha

93 ఏళ్ళ బామ్మకు ఇంగ్లీష్ లో పిహెచ్ డి పట్టా..

దక్ష న్యూస్, హైదరాబాద్: నవంబర్ 3

చదువు కోవాలనే కోరిక ఉండాలనే కానీ చదువుకి వయసుతో సంబంధం లేదు అంటారు. చదువుపై మక్కువ, చదువుకోవాలనే పట్టుదల ఉంటే చదువుకి వయసుతో పని లేదని నిరూపించారమె. 93 ఏళ్ల వయసులో ఇంగ్లీష్‌లో పీహెచ్‌‌డి పట్టా సాధించి ఔరా అనిపించారు. ఆమే సికింద్రాబాద్‌లోని కీస్ ఎడ్యుకేషనల్ సొసైటీలో పనిచేస్తున్న 93 ఏళ్ల రేవతి తంగవేలు ( revathi thangavelu ). వివరాల్లోకెళితే..

Hospital

ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవంలో ఇంగ్లీష్‌లో పీహెచ్‌‌డి పట్టా పొందిన 93 ఏళ్ల వృద్ధురాలు రేవతి తంగవేలు, ఆంగ్ల వ్యాకరణం, వర్ణమాల, పదాల నిర్మాణం వంటి అంశాలపై పరిశోధన చేశారు. ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ చేతుల మీదుగా ఆమె పీహెచ్‌‌డి అందుకున్నారు. దాంతో ఒక్క సారిగా అందరి చూపు ఆమె వైపు మళ్ళింది. లేట్ వయసులో లేటిస్ట్ గా చదువులో యువతతో పోటీ పడి పిహెచ్ డి పట్టా పొందిన రేవతి తంగవేలును అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

రేవతి తంగవేలు 1990 లో లెక్చరర్‌గా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కీస్ ఎడ్యుకేషనల్ సొసైటీలో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 83 వ స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందిన 1,024 మంది పీహెచ్‌‌డి గ్రాడ్యుయేట్లలో రేవతి తంగవేలు ఒకరు. ఇది ఒక సంవత్సరంలో భారతదేశంలో ఏ యూనివర్సిటీ సాధించని రికార్డు. ఈ కార్యక్రమంలో చదువుల్లో ప్రతిభ కనబరిచిన 58 మంది విద్యార్ధులకు బంగారు పతకాలతో సత్కారం జరిగింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ చేతుల మీదుగా పీహెచ్‌‌డి అందుకోవడం పట్ల రేవతి తంగవేలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.