Read News in Telugu Language
adsdaksha

రియల్ మోసం..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 26

మౌనిక ఎస్టేట్స్ పై బాధితుల పిర్యాదు..

విలేకరుల సమావేశంలో తమకు న్యాయం చేయాలన్న బాధితులు..

గత ఏడాది డిసెంబర్లో ఖానాపురం కి చెందిన నార్ల మౌనిక , ఆమె తండ్రి నార్ల మల్సూర్ తో పాటు నేలకొండపల్లికి చెందిన వాసం రాధాకృష్ణ అనే వ్యక్తి కలిసి మౌనిక ఎస్టేట్స్ పేరుతో భూములు తీసుకొని డెవలప్మెంట్ చేస్తామంటూ ప్రచారం చేసారని అది తెలిసిన మేము అందులో పెట్టుబడులు పెట్టామని బాధితులు గురువారం
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

బాధితులు గోరింట్ల అభిరామ్ , కంచుమర్తి సైదాబాబు , కంచుమర్తి ధనమ్మ , కొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు , కొమ్మిశెట్టి అరుణ , జె. ముత్తులింగం , వి. రాజేంద్రప్రసాద్ , కె. రాజశేఖర్ , డి. రాహుల్ , బి.లక్ష్మి , సిహెచ్. గోపి , శంకర్ , వరుణ్ , అశోక్ , అక్షిత , శిరీష , స్రవంతి , రమేష్ , పూజ , మానస , కొండలు , నాగేశ్వరరావు , బాలిన రాజు తదితరులు తెలిపిన వివరాల ప్రకారం..

Hospital

Read also : బిఆర్ఎస్ మ్యానిఫెస్టో తో ప్రజలకు ఎంతో మేలు : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

సదరు మౌనిక ఎస్టేట్స్ తమవద్ద డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే రోజువారీ వడ్డీ డబ్బులు చెల్లిస్తామని, తెలిపారని వెల్లడించారు. పది నెలల్లోనే కట్టిన డబ్బులు డబుల్ చేసి ఇస్తామని ఇచ్చిన ఆఫర్ నచ్చి వారికి బాధితులందరూ కలిసి మొత్తంగా దాదాపు 2 కోట్ల రూపాయలు వసూలు చెల్లించారని అన్నారు. దీంట్లో తమ భాగస్వామ్యం 50 లక్షల రూపాయలు ఉందన్నారు. కాగా వారు ముందుగా చెప్పినట్లు ప్రతిరోజు వడ్డీని దాదాపు రెండు నెలలు ఇచ్చి ఆపివేశారని తెలిపారు. దీనిపై మేము వారిని ప్రశ్నించగా మాకు రావలసిన డబ్బులతో పాటు, కొంత భూమిని సైతం మా పేరున రిజిస్ట్రేషన్ చేయిస్తామని అనడంతో మేము కొన్ని రోజులు వేచిచూడాలనుకున్నామని అన్నారు. ఇది జరిగిన దాదాపు నెల తరువాత మేము వారికి చెల్లించిన డబ్బులను వేరే దాంట్లో పెట్టుబడి పెట్టామని చెప్పడంతో , వారు చెప్పిన విషయాలపై మేము విచారణ జరుపగా వారు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తెలిసిందని వెల్లడించారు. వారు మేము కట్టిన డబ్బులను స్వంతానికి వాడుకున్నారే తప్ప , ఎటువంటి పెట్టుబడి పెట్టలేదని రూఢీ అయ్యిందన్నారు. దీంతో ఈ విషయంపై వారిని అడుగగా వారు తప్పు ఒప్పుకొని 45 రోజుల వ్యవధిలో పూర్తి డబ్బులు చెల్లిస్తామని పెద్దమనుష్యుల సమక్షంలో మాకు ఒక అంగీకారపత్రము వ్రాసి ఇచ్చారన్నారు. ఇది జరిగి ఇప్పటికి మూడు నెలలు అయినా ఎటువంటి ఫలితం లేదని దీంతో మరలా వారిని మా డబ్బులు ఇవ్వాలని అడగడంతో మాపై బెరిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్థికంగా ఎన్నో బాధలు పడుతున్న మాలో కంచుమర్తి ధనమ్మ కుమార్తెకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి పరిస్థితి విషమంగా మారిందన్నారు.

డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో తమకు రావలసిన డబ్బుల విషయమై అడగడానికి నార్ల మల్సూర్ ఇంటికి వెళ్ళగా, ఆ సమయంలో మౌనిక ఎంగేజ్మెంట్ జరుగుతుందని అన్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని వారు క్రొత్త డ్రామా ఆడుతూ, డబ్బులు అడగడానికి వెళ్ళి బాధితులమైన మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఏ విధంగానైనా మాకు ఇవ్వవలసిన డబ్బులను ఎగ్గొట్టే విధంగానే వారు ప్రవర్తిస్తున్నారని మా డబ్బులను తిరిగి ఇచ్చేలా వారి ప్రవర్తన కనిపించడం లేదన్నారు. పెద్దమనుష్యుల సమక్షంలో వ్రాసి ఇచ్చిన అంగీకారపత్రాన్ని కూడా లెక్కచేయకుండా మమ్ములను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని వెల్లడించారు. ఈ విషయంపై పోలీసు అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని విలేకరుల సమావేశంలో బాధితులు కోరారు .

Leave A Reply

Your email address will not be published.