Read News in Telugu Language
adsdaksha

రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ప్రపంచ కప్ నుండి ఐర్లాండ్ మ్యాచ్ దాకా..

దక్ష న్యూస్, ఇంటర్నెట్ డెస్క్ :

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభ ఎడిష‌న్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని ఎడిష‌న్ల‌లో ఆడిన ఏకైక ఆట‌గాడిగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు.
న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఈ అరుదైన ఘ‌న‌త అందుకున్నాడు.

తొలి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2007లో ద‌క్షిణాప్రికా వేదిక‌గా జ‌రిగింది. ధోని నేతృత్వంలో భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించి విజేత‌గా నిలిచింది. ఈ జ‌ట్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ స‌భ్యుడిగా ఉన్నాడు. ఆ త‌రువాత 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ప్ర‌పంచ‌క‌ప్‌లు జ‌ర‌గ‌గా అన్నీ ఎడిష‌న్ల‌లో భార‌త జ‌ట్టు త‌రుపున రోహిత్ శ‌ర్మ ఆడాడు. మొత్తం 8 ఎడిష‌న్ల‌లో రోహిత్ 34.39 స‌గ‌టు 127.88 స్ట్రైక్‌రేటుతో 963 ప‌రుగులు చేశాడు.

Hospital

read also :రఘురాంరెడ్డిది ఆల్ టైం రికార్డు : కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మంత్రి పొంగులేటి..

ప్ర‌స్తుతానికి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ ఒక్క‌డే ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక ఆట‌గాడిగా ప్రత్యేకత సంతరించుకున్నాడు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ ఈ ఘ‌న‌త‌ను అందుకునేందుకు అడుగుదూరంలో ఉన్నాడు. ష‌కీబ్ కూడా 2007 నుంచి ప్ర‌తీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతూ వ‌స్తున్నాడు. ఈ సీజ‌న్‌లో బంగ్లాదేశ్ ఇంకా తొలి మ్యాచ్‌ ఆడలేదు.
జూన్ 8 శ‌నివారం బంగ్లాదేశ్ ఈ టోర్నీలో మొద‌టి మ్యాచ్ శ్రీలంక‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో ష‌కీబ్ బ‌రిలోకి దిగితే అత‌డు హిట్‌మ్యాన్ స‌ర‌స‌న చేరుతాడు. ష‌కీబ్ 8 ప్ర‌పంచ‌క‌ప్ ఎడిష‌న్ల‌లో 23.93 స‌గ‌టు, 122.44 స్ట్రైట్‌రేటుతో 742 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రు కాకుండా మ‌రే ఆట‌గాడు కూడా అన్ని ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడ‌లేదు.

 

Leave A Reply

Your email address will not be published.