Read News in Telugu Language
adsdaksha

పంట రుణ మాఫీ వారం రోజుల్లో పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 26

పంట రుణ మాఫీ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( v.p. gautham )  అన్నారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిసిసిబి( dccb )  చైర్మన్ కూరాకుల నాగభూషణం ( kurakula nagabhushanam ) తో కలిసి, అధికారులతో పంట రుణ మాఫీ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం లక్ష రూపాయల పంట రుణమాఫీ క్రింద కుటుంబానికి లక్ష రూపాయల పంట రుణమాఫీ వర్తిస్తుందన్నారు. పంట రుణమాఫీ ( runa mafi) పొందిన రైతులకు పంట రుణాల రెన్యూవల్ చేయాలన్నారు. మొదటి విడతగా రూ. 25 వేల వరకు పంట రుణమాఫీకి గాను జిల్లాలో 20343 మంది రైతులకు రూ. 26.015 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశామన్నారు.

read also : కేసిఆర్ తోనే సమగ్రాభివృద్ధి ..

రెండో విడతగా రూ. 25 వేల నుండి రూ. 50 వేల వరకు ఉన్న పంట రుణమాఫీకి 22335 మంది రైతులకు రూ. 70.004 కోట్లు, మూడో విడత క్రింద లక్ష వరకు పంట రుణాలు ఉన్న 46415 మంది రైతుల ఖాతాల్లో రూ. 278.401 కోట్లు, మొత్తంగా 89093 మంది రైతులకు పంట రుణమాఫీ క్రింద రూ. 374.42 కోట్లు వారి వారి ఖాతాల్లో జమచేసినట్లు ఆయన అన్నారు. ఇందులో డిసిసిబి కి చెందిన 44 వేల ఖాతాలకు రూ. 130 కోట్లు జమ అయ్యాయని ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్ల నుండి జాబితా తీసుకొని పంట రుణాల రెన్యూవల్ కి చర్యలు తీసుకోవాలని అన్నారు.

Hospital

జమ అయిన ఖాతాలు రైతుల వారిగా జాబితా తయారు చేయాలని కలెక్టర్ కోరారు. ఏఇఓ క్లస్టర్ వారిగా, మండలాల వారిగా రోజువారి ప్రగతిని సమర్పించాలన్నారు. పంట రుణ మాఫీ అందని వారికి, ఏ కారణం చేత ఆగిందో పరిశీలించి, వారి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మరణించిన రైతుల వివరాలు తీసుకొని, ఆయా తహశీల్దార్ల నుండి కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పొంది, వారికి పంట రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

read also : దసరా నుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకం..

సమావేశంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ, పంట రుణమాఫీ విడుదల మొత్తం సెలవు దినాల్లోనూ పనిచేసి 4 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రైతులకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, డిసిసిబి సిఇఓ వీరబాబు, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, డిసిఓ విజయ కుమారి, ఇంచార్జి డీఏఓ సరిత, బ్యాంకర్లు, ఏడీఏలు, ఏవోలు, సొసైటీ సిఇఓ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.