Read News in Telugu Language
adsdaksha

bjp : ఖమ్మం వేదికగా బిజేపి ఎన్నికల శంఖారావం..

దక్ష న్యూస్, ఖమ్మం: ఆగస్ట్ 27

కారు స్టీరింగ్‌ అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ..

రైతు గోస-బీజేపీ భరోసా సభలో కేంద్ర మంత్రి అమిత్ షా..

కాంగ్రెస్‌  ( congress ) పార్టీ సోనియా గాంధీ కుటుంబం కోసం పనిచేస్తుంటే, బీఆర్ఎస్ ( brs )  కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. తెలంగాణలో ఈ సారి సీఎం అయ్యేది కేసీఆర్ (KCR) లేదా కేటీఆర్ (KTR) కాదని బీజేపీ నేతనే సీఎం అవుతారని అమిత్ షా ( Amit Shah ) ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా  ( rythu gosa – bjp bharosa ) పేరిట నిర్వహించిన ఎన్నికల శంఖావసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ తప్పక గెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్‌ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు.

భద్రాచలం  ( bhadrachalam ) లోని రాముడి వద్దకు సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదని అమిత్ షా నిలదీశారు. బీజేపీ గెలుస్తుందని, తమ పార్టీ సీఎం భద్రాచలం వెళతారని అన్నారు. రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. కాంగ్రెస్ 4జీ పార్టీ అయితే, బీఆర్ఎస్ 2జీ పార్టీ అని ఎద్దేవా చేశారు. చివరకు ధాన్యం కొనుగోళ్లపై కూడా కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

read also : greece : గ్రీస్ లో నలభై ఏళ్ళ తర్వాత భారత ప్రధాని పర్యటన..

Hospital

కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలన్నా, ఉద్యమకారుల కల నెరవేరాలన్నా బీజేపీని గెలిపించాలని అన్నారు. ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా సభ రైతుల గోసపై బీజేపీ భరోసా ఇస్తుందన్నారు. రజాకార్ల వారసత్వానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వచ్చి 75 ఏళ్లు అయ్యిందన్నారు. అభినవ సర్ధార్ పటేల్ అమిత్ షా అని కొనియాడారు.

తెలంగాణ లో ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రైతు రుణమాఫీ తూతూ మంత్రంగా ఉందన్నారు. రుణమాఫీ రైతులను మోసం చేయటమే అవుతోందని, ప్రభుత్వం రైతులకు మేలు చేయడంలేదన్నారు. ఖమ్మం జిల్లాలో వర్షాలు, వరదలకు రైతులు నష్టపోతున్నారన్నారు. తొమ్మిదేళ్లుగా పంటల భీమా చేయకపోవడంతో రైతులకు సాయం అందటం లేదన్నారు. కోటి ఎకరాల సాగుభూమి అన్నారు. ఎక్కడికి పోయింది. కోటి ఎకరాల మాగాణి ఏది? ధరణి పోర్టల్ .. కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్లుందని ఎద్దేవా చేశారు.

read also : కొత్త నటీనటులతో సికాడా.. నాలుగు భాషలు 24 విభిన్న ట్యూన్స్ తో సంచలనం ..

అంతేకాదు తెలంగాణ కేసీఆర్ పాలన లో విధ్వంసం అయ్యిందని కిషన్ రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ అయ్యింది. ఫసల్ భీమా పథకం అమలు చేయలేదు. 9ఏళ్లుగా వ్యవసాయ రుణాలు, పావలా వడ్డీ ఇవ్వడం లేదు. రైతుల ఆత్మహత్యల్లో 70 శాతం కౌలు రైతులు ఉన్నారు. కల్తీ విత్తనాలకు కేరాఫ్ గా తెలంగాణ మారిందన్నారు.

బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరిత్యాల సమయంలో రైతులకు అండగా ఉంటాం. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది. కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం పని చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పనిచేసేది కల్వకుంట్ల కుటుంబం కోసమే. కాంగ్రెస్ కి ఓటేస్తే బీఆర్ఎస్ కి ఓటు వేసినట్లే. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే మజ్లిస్ కి ఓటు వేసినట్లే. ఈ రాష్ట్రంలో మార్పు రావాలన్నా, తెలంగాణ ఉద్యమకారుల కల నెరావేరాలన్నా బీజేపీనే గెలిపించండి. బీజేపీని ఆదరించండి” అని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.