Read News in Telugu Language
adsdaksha

పాశ్చాత్య ఆవిష్కరణలు మన వేదాల్లోనివే.. ఇస్రో శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు..

ఎప్పుడో సంస్కృతంలో రాసి ఉంచారని వెల్లడి..

వేద కాలం నుండి మనది విజాన సమాజమని భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో ( isro ) చైర్మన్ ఎస్. సోమనాధన్ ( s. somanadhan ) వెల్లడించారు. అయితే ఈ విజానమంతా కొన్ని వేల ఏళ్ల తర్వాత పాశ్చాత్య శాస్త్రవేత్తల ఆవిష్కరణలుగా మన దేశానికి వచ్చాయన్నారు. బుధవారం ఉజ్జాయిని ( ujjayini ) లో మహర్షి పాణిని సంస్కృత వేద విశ్వవిద్యాలయం ( maharshi panini vedic vishwavidyalaya ) నాలుగో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గణితం, వైద్యం, ఖగోళశాస్త్రం ఆధ్యాత్మిక విద్య తదితరాలన్నీ సంస్కృతంలో రాసి ఉండడంతో మనది వేద విజాన సమాజమని తెలిపారు.

 

Hospital

read also : చంద్రయాన్‌-3 మిషన్‌లో సాఫ్ట్‌వేర్‌ రూపొందించింది తెలుగు యువకుడే

 

ప్రపంచంలోనే సంస్కృతం ప్రాచీన భాష అని, కవిత్వం, తర్కం, వ్యాకరణం, తత్వం, శాస్త్ర సాంకేతిక రంగాలు గణితం ఇతర అనుబంధ పాఠ్యాంశాలన్నీ దానిలో ఉన్నాయన్నారు. వ్యవస్థ సూర్యుడి చుట్టూ పరిబ్రమించే తీరు, దానిని బట్టే సమయం వంటివన్నీ ఉన్నాయన్నారు. ఇవన్నీ ఇక్కడి నుండి అరబ్బుల వద్దకు, ఆ తర్వాత ఐరోపాకు వెళ్లి మళ్ళీ మనవద్దకే తిరిగి వచ్చాయన్నారు. సున్నా, అనంతం, బీజగణితం, పైదా గరస్ సిద్దాంతం వంటివాటి గురించి సంస్కృతంలో అత్యంత ఖచ్చితత్వంతో కవితాత్మకంగా ఎప్పుడో మన ప్రాచీనులు వివరించారన్నారు. విశ్వంలో కూర్పు, లోహ శాస్త్రం, వైద్య చికిత్సలు వంటివాటిని పొందుపరచినట్లు వివరించారు. కంప్యూటర్ భాషకు ఇది చక్కగా సరిపోతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.