Read News in Telugu Language
adsdaksha

యువ సేవ సమితి ఆధ్వర్యంలో చిన్నారి కి ఆర్థికసాయం..

దక్ష న్యూస్, సత్తుపల్లి : మార్చి 14

ఇటీవల సత్తుపల్లిలో రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన సాధు శ్రీలేఖకు యువ సేవా సమితి ఆధ్వర్యంలో 54,641 రూపాయల ఆర్థికసాయాన్ని గురువారం సత్తుపల్లి సిఐ చేతుల మీదుగా అందించారు. యువ సేవ సమితి చేస్తున్న కార్యక్రమాలకి తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఒక్కదాతకు సేవాసమితి తరపున ధన్యవాదాలు తెలిపారు.

Hospital

యువసేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రోడ్డు యాక్సిడెంట్లో గాయపడిన సాదు శ్రీలేఖ కి రూ. 54,641 లను వారి తండ్రి బిక్షమయ్య కి సత్తుపల్లి సిఐ చేతుల మీదగా అందించడం జరిగింది ఈ సందర్భంగా సత్తుపల్లి సిఐ మాట్లాడుతూ సమాజంలో యువ సేవా సమితి చేస్తున్న సహాయం ఎనలేనిదని, భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేయాలని, యువత మార్పుకు తోడ్పడే కార్యక్రమాల్లో మేము కూడా మీతో పాలుపంచుకుంటామని తెలియజేశారు..

అనంతరం యువ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గత నెలలో ఆర్కే ఫౌండేషన్ అధినేత రాధాకృష్ణకి 34,000 రూపాయలు సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా దయానంద్ విజయకుమార్ గారి చేతుల మీదుగా అందించడం
జరిగిందని తెలిపారు. ఈ నెలలో సాదు శ్రీలేఖకి 54,641 రూపాయలు అందించడం జరిగిందని, సేవా సమితి అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి కారణం అయిన యువసేన ప్రోత్సహిస్తున్న దాతలు, దాతల కృషి వల్ల మాకు సాధ్యం కానీ కార్యక్రమాలు కూడా మేము చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో యువసేవ సమితి వ్యవస్థాపకులు జొన్నగట్ల రాజు డైరెక్టర్ ప్రిన్స్ ఈదుల, షేక్ ఇమ్రాన్, ఇంచార్జ్ మల్లెల వెంకీ ,పూర్ణ కంటి శ్యామ్, పూల మధు సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.