Read News in Telugu Language
adsdaksha

salaar : మల్టీప్లెక్స్‌లలో సలార్ టికెట్ ధర రూ.450..?

దక్ష సినిమా న్యూస్, హైదరాబాద్: 20

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డార్లింగ్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్ పార్ట్ – 1 ( salaar movie part 1 ) మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుండడంతో అభిమానుల సందడి అంబరాన్నంటుతోంది. ఈ చిత్రం టికెట్ల బుకింగ్ కోసం ఓ యుద్దమే మొదలైంది. దాంతో బుక్ మై షో యాప్ సైతం క్రాష్ అయింది. దాంతో టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్న హైదరాబాద్‌లోని ప్రభాస్ అభిమానుల ఉత్సాహాన్ని దెబ్బతీసేలా రాష్ట్రంలో టికెట్ల అమ్మకాలపై పుకార్లు మొదలయ్యాయి.

రిలీజ్ కు ఐదు రోజుల ముందే హిందీ,కన్నడ, తమిళ్ బాషల్లోని షోలకు బుక్ మై షో యాప్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిన్నటి వరకు యాప్ ఓపెనే కాలేదు. అయితే నిర్మాతల విన్నపాల మేరకు నిన్న సాయంత్రమే బెనిఫిట్ షో, స్పెషల్ షో, టికెట్ ధర విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి పర్మిషన్ లు వచ్చాయి. యాప్ ఓపెన్ అయ్యి అవ్వగానే అభిమానులు ఒకే సారి లక్షల సంఖ్యలో యాప్ ఓపెన్ చెయ్యడంతో యాప్ క్రాష్ అయింది. దాంతో నగరాల్లోని మల్టీపెక్స్ లలో టికెట్ ధరలు రూ. 450 ఉండొచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Hospital

దాంతో నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర సుమారు రూ. 450 ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇతర సినిమాలను చూసేందుకు సాధారణంగా అభిమానులు చెల్లించే దానితో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ ధర. వారం రోజుల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉంది.

టిక్కెట్ ధర పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంలో హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లు ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. అయితే, బుకింగ్‌లు తెరిచినప్పుడు మాత్రమే నిజమైన ధరలు నిర్ధారించబడతాయని సమాచారం.

Leave A Reply

Your email address will not be published.