Read News in Telugu Language
adsdaksha

భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త .. మేడారం ప్రసాదం హోం డెలివరీ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 14

తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యమైన గిరిజనుల మేడారం సమక్క సారలక్కల జాతరకు పోలేని భక్తులకు టీఎస్ ఆర్టీసీ ( ts rtc ) శుభవార్త చెప్పింది. జాతరకు వెళ్లకుండానే అక్కడి ప్రసాదం కావాలనుకుంటే హోం డెలివరీ (home delivery ) చేసేందుకు ఆర్టీసీ ముందుకొచ్చింది. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం ( medaram ) సమ్మక్క సారలమ్మ ( sammakka saaralamma ) జాతర జరగనుంది. ఆ భక్తులకు సమ్మక్క సారలమ్మల ప్రసాదాన్ని, మేడారం పసుపు, కుంకుమను టిఎస్ ఆర్టీసీ ఇక పై హోమ్ డెలివరీ చేయనున్నది. టీఎస్ఆర్టీసీ నిర్ణయంపై వనదేవతల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ ( minister ponnam prabhakar ) సూచనల మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోలేని భక్తులకు ప్రసాదం (బంగారం), పసుపు కుంకమ అందజేయాలని నిర్ణయించినట్టు టీఎస్ ఆర్టీసీ ఎండీ ( rtc md ) వీసీ సజ్జనార్‌ ( v.c. sajjanar ) తెలిపారు.

Hospital

read also : ఎల్బీ నగర్ లో రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్సైకి గాయాలు..

ఈ నెల 14 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు వెల్లడించారు. బుకింగ్‌ సదుపాయం కేవలం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుక్‌ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుందని స్పష్టం చేశారు. https://rb.gy/q5rj68 వెబ్ లింక్ ద్వారా గానీ, భక్తులు తమకు సమీపంలోని టీఎస్ఆర్టీసీ కార్గో/లాజిస్టిక్స్ కౌంటర్లలో గానీ రూ.299 చెల్లించి మేడారం సమ్కక్క సారలమ్మ ప్రసాదాన్ని ముందుగా బుక్ చేసుకోవచ్చని వివరించారు. లేకపోతే, పేటీఎం ఇన్ సైడర్ యాప్ ద్వారా కూడా ప్రసాదాన్ని ఆన్ లైన్ లో భక్తులు కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. ఆన్‌లైన్ బుకింగ్‌ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్‌‌కోడ్‌, ఫోన్‌ నంబర్‌‌ను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.