Read News in Telugu Language
adsdaksha

ఎంపీల సమక్షంలో సత్తుపల్లిలో సండ్ర నామినేషన్..

దక్ష న్యూస్, సత్తుపల్లి: నవంబర్ 9

ఆలయంలో ప్రత్యేక పూజలు.. హాజరైన వద్దిరాజు, నామా, బండి..

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ( vaddiraju ravi chandra ), డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి ( dr. bandi pardasaradhireddy ) ..లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు ( nama nageswararao ) లతో కలిసి సత్తుపల్లి ( sattupalli ) లో బిఆర్ఎస్ ( brs ) పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ( sandra venkata veeraiah ) గురువారం నామినేషన్ దాఖలు చేశారు.

read also : ఏయే శివలింగాల్ని ఎలాంటి పూజా ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం కలుగుతుంది..

Hospital

ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు, పార్థసారథి రెడ్డిలతో కలిసి దేవాలయం వద్ద నుంచి వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు వెంట రాగా పాదయాత్రగా ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ ఆఫీసర్ అశోక్ చక్రవర్తికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

ఈ సందర్భంగా మునిసిపల్ ఛైర్మన్ మహేష్, ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమా మహేశ్వర రావులు పాదయాత్రలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు,ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇతర ప్రముఖులు, నాయకులు అధికసంఖ్యలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.