Read News in Telugu Language
adsdaksha

కాలం చెల్లిన వారంటీలతో వస్తున్నకాంగ్రెస్ కి సత్తుపల్లిలో అభ్యర్ధులెవరు..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 31

విజయోత్సవ సభను తలపించేలా గులాబీ శ్రేణులను ఉత్సాహ పరిచేలా దాదాపు 70 వేలమందికి పైగా అభిమానులు కార్యకర్తలతో బుధవారం కల్లూరు (kalluru ) లో సత్తుపల్లి ( sattupalli ) నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించబోతున్నామని, బిఆర్ఎస్ ( brs ) సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ( sandra venkataveeraiha ) అన్నారు. మంగళవారం సభాప్రాంగణంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ( tata madhu ) తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు కుంతంత్రాలు పన్నినా నా గెలుపును ఆపలేరన్నారు.

read also : బీఆర్ఎస్ పార్టీకి జలగం జలక్..

Hospital

ఇప్పటికే నియోజకవర్గ ఓటర్లను ఒక దఫా కలవడం జరిగిందన్నారు. లక్ష కుటుంబాలను కలిసి ఇంటింటికి బిఆర్ఎస్ మేనిఫెస్టోను అందించడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలకు ఎంతో నచ్చాయని అన్నారు. ఆచరణకు సాధ్యం కాని విధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ప్రజల్లో ఉండే నాయకుడెవరో ప్రజలకు సేవ చేసే నాయకుడెవరో ప్రజలకు తెలుసన్నారు.

read also : ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ దూరపు కొండలు నునుపని, దగ్గరుండి సేవలు చేసే సండ్ర వెంకట వీరయ్యను కాదని ప్రజలు మరెవరికో ఓటు వేయరన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ సూక్తిని సండ్ర పుణికిపుచ్చుకున్నారన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలే మన సమస్యలు అనుకునే పదిమంది ఎమ్మెల్యేల్లో సండ్రది మొదటి స్థానం అన్నారు. ఎక్కడో పుట్టిన కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిన వారంటీలతో ముందుకొస్తుందని, కాంగ్రెస్ పార్టీకి సత్తుపల్లిలో ప్రకటించడానికి అభ్యర్ధే లేరన్నారు.

Leave A Reply

Your email address will not be published.