Read News in Telugu Language
adsdaksha

గాంధీజీ పాఠశాలలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు ..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 11

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను ( sankranti celebrations ) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల మైదానంలో రంగు రంగులతో సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చి సుందరంగా తీర్చిదిద్దారు.

విద్యార్థులు ఆటపాటలతో, హరిదాసు వేషాధారణతో సంక్రాంతి పండుగకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మొదటి రోజు రంగురంగులతో ఇంటి ముందు వాకిట్లో సంక్రాంతి ముగ్గులు వేసి, భోగిమంటలు వెలిగించి ఆ మంటల్లో పిడికలు వేసి, ఆ పిడికల భస్మాని నుదుట పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు.

Read also: వాహనదారులకు శుభవార్త.. ట్రాఫిక్ చలాన్స్ చెల్లింపునకు గడువు పొడిగింపు..

Hospital

చేదు జ్ఞాపకాలను, పాత వస్త్రాలను భోగిమంటల్లో వేయాలని కోడి శ్రీనివాస్ అన్నారు. రేగు పండ్లను నీళ్లల్లో వేసి, ఆ నీటితో స్నానం చేస్తే శుభం కలుగుతుందని సంక్రాంతి పండుగ గురించి విద్యార్థులకు వివరించారు. నూతన సంవత్సరంలో సంక్రాంతి పండుగకు స్వాగతం పలకాలని పిండి వంటలు, నూతన వస్త్రాలతో పండుగ జరుపుకోవాలని, అందరికి శుభం కలగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు, ఆటపాటల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.

Read also: అప్పులను చూపి .. తప్పించుకునే ప్రభుత్వం కాదు : పొంగులేటి

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కర్నాటి నాగరాజు, సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ బంధనాదం సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.