Read News in Telugu Language
adsdaksha

హలో కేటీఆర్! సత్తుపల్లి జిల్లాను ప్రకటించి సత్తుపల్లిలో అడుగు పెట్టండి ..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 29

– టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్..

మంత్రి కేటిఆర్ ( ktr ) సత్తుపల్లిని జిల్లా గా ప్రకటించి ఆ తర్వాతే సత్తుపల్లి ( sattupalli ) లో అడుగు పెట్టాలని టిపిసిసి ( tpcc ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ( koturi manavatha roy ) అన్నారు. సింగరేణి ఉపరితల గనుల బాంబు పేలుళ్ల బాధితులకు ఇంటికి రూ.10 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సత్తుపల్లి జిల్లా ప్రకటించకుంటే, బాంబు పేలుళ్ల బాధితులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయకుంటే కేటిఆర్ నిరసన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు పరిసర ప్రాంతాలలో ప్రజలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని మానవతారాయ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సత్తుపల్లి బొగ్గు బాంబు బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు దెబ్బతిని పడిపోయే దశలో ఉన్నాయన్నారు. ఈ నిర్వాసితుల సమస్యలు తీర్చకుండా సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కాలయాపన చేస్తున్నారన్నారు. గత 9 సంవత్సరాలు కాలయాపన చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీ పరిపాలన ఘనత అని ఎద్దేవా చేశారు.

read also : అక్టోబర్ 3న ఎలక్షన్ కమిషన్ పర్యటన..

సత్తుపల్లి లోని బొగ్గు బ్లాస్టింగ్ బాధితులకు ఇండ్లు నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీ సింగరేణి అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ బాధితులకు నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేయక పోవడం, కనీసం పట్టించుకోక పోవడం వల్లే ప్రజలు ఆదుకునే నాధుడు లేక అల్లాడిపోతున్నారన్నారు.

సత్తుపల్లి నియోజకవర్గం లో దళిత బంధు ఆర్థిక సహాయాన్ని తూతూ మంత్రంగా సుమారు 100 కుటుంబాలకు మంజూరు చేసి, నిజమైన అర్హులను ఎంపిక చేసి కూడా ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నచ్చిన వారికి ఇవ్వడం జరిగిందని వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మందలపు శ్రీనివాసరెడ్డి శుక్రవారం సత్తుపల్లిలో నిర్వహించిన సమావేశంలో అన్నారు. దళిత బంధు సత్తుపల్లి నియోజకవర్గం లోని నిరుపేద దళిత కుటుంబాల అందరికి వర్తింపజేయాలన్నారు. ఎన్నికల సందర్భం లో హడావిడి చేయడం ఓట్ల రాజకీయమే తప్ప మరొకటి కాదని, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం ను నియోజకవర్గంలోని అన్ని దళిత కుటుంబాలకు ఇచ్చి ఆదుకోవాలని సూచించారు.

Hospital

నియోజకవర్గంలోని గొల్ల కురుమ యాదవులకు గొర్రెల పంపిణీ పథకమును ప్రవేశపెట్టి గొర్రెల యూనిట్లను మంజూరు చేస్తామని చెప్పి నియోజకవర్గ స్థాయిలో లబ్ధిదారులు నుంచి సుమారు 40 వేల రూపాయలు గొర్రెలకు డబ్బులు కట్టించుకుని సంవత్సరాలు గడుస్తున్నా గొర్రెలు పంపిణీ చేయకపోవడం ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేయటమే తప్ప మరొకటి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఇంటికి 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నేటికీ లబ్ధిదారులకు మంజూరు చేయకపోవడం మంత్రి కేటిఆర్ గమనించాలన్నారు.

ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకుండా కాలయాపన చేసి, ఎన్నికల హడావిడిగా ఓట్లు దండుకోవడం కోసం తూతూ మంత్రంగా ఇండ్లు మంజూరు చేయడం, అది కూడా టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి మంజూరు చేసుకోవడం మిగతా నిరుపేద కుటుంబాల వారిని అవమానపరచడమే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

read also : రేపే జిల్లాలో కేటిఆర్ పర్యటన..

నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాటి మీద దృష్టి పెట్టి పరిష్కరించే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు చూడాలని అభివృద్ధి అంటే ప్రారంభోత్సవాలు కాదని ప్రతి ఒక్క పేదవాడికి కూడు గూడు విద్య ఉద్యోగం వైద్యం వంటి సదుపాయాలను కల్పించి ప్రజలు ఆర్థికంగా బలపడే విధంగా ఉండాలన్నారు.

సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎప్పటినుంచో జిల్లా చేసుకోవాలని ప్రజలు ఆకాంక్షతో ఉన్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా జిల్లా ని ప్రకటించే విధంగా చూడాలని కోరారు. బొగ్గు ఉన్నచోటే విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్తు ధర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటుచేసి నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే చైతన్య వంతమైన సత్తుపల్లి ప్రజా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ విజయబాబు, గండ్ర జగన్ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జట్టి రామారావు, గురవయ్య, సత్యనారాయణ రెడ్డి, నాగులు, పుల్లయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.