Read News in Telugu Language
adsdaksha

సంక్రాంతి ముగ్గుల్లో సత్తా చాటిన సత్తుపల్లి యువకులు..

దక్ష న్యూస్, సత్తుపల్లి: జనవరి 13

మహిళల పోటీలకు ధీటుగా మగమహారాజుల రంగవల్లులు ..

సంక్రాంతి పండుగ సందర్భంగా భారతదేశం యావత్తు రంగవల్లలతో సందడిని సంతరించుకుంటుంటే పలు ప్రాంతాల్లో మహిళలకోసం ముగ్గుల పోటీలు నిర్వహించడం చూస్తున్నాం. అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాత్రం అందుకు భిన్నంగా మహిళలకు ధీటుగా కొందరు యువకులు ముగ్గుల పోటీలు నిర్వహించుకొని పోటీల్లో అందమైన రంగవల్లులు తీర్చిదిద్దడం ఆసక్తికరంగా మారింది.

Hospital

 

సత్తుపల్లి పట్టణంలోని రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ సమీపంలోని వి డాన్స్ అకాడమీ స్టూడెంట్స్ కొందరు తామెందుకు ముగ్గుల పోటీల్లో పాల్గొనకూడదని ఆలోచించారు. ముగ్గులు వేయడం ఆడవారికి మాత్రమే సొంతమా అంటూ పోటీలకు సిద్దమయ్యారు. డాన్స్ మాస్టర్ ప్రోత్సాహంతో స్కూల్ బిల్డింగ్ పై ఉన్న ప్రదేశాన్నే మైదానంగా మార్చుకొని ముగ్గుల పోటీల్లో సత్తా చాటారు.

read also : కారు షెడ్ కి పోలేదట.. సర్వీసింగ్ కి మాత్రమే వెళ్ళిందట.. ఓటమిపై కేటిఆర్ వ్యాఖ్యలు..

Leave A Reply

Your email address will not be published.