Read News in Telugu Language
adsdaksha

సీఎం సభాస్థలిలో మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 31

శుభాకాంక్షలు తెలిపిన ఎంపి రవిచంద్ర..

Hospital

మంత్రి సత్యవతి రాథోడ్ ( satyavathi rathod )   జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ( vaddiraju Ravi Chandra ) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లందు ( yellandu ) లో బుధవారం (నవంబర్ 1) జరిగే బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మంత్రి సత్యవతి చేత ఎంపీలు రవిచంద్ర, మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, మహబూబాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ అంగోతు బిందులతో కలిసి కేక్ కట్ చేయించారు.

 

సభాస్థలి వద్ద ఏర్పాట్లలో నిమగ్నమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, ఇల్లందు మునిసిపల్ ఛైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైఎస్ ఛైర్మన్ జానీపాషా, బీఆర్ఎస్ నాయకులు మర్రి రంగారావు, మూల మధుకర్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు మంత్రి సత్యవతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.