Read News in Telugu Language
adsdaksha

25న సచివాలయ గుడి,చర్చి,మసీదులకు ప్రారంభోత్సవం ..

తొలి పూజలు చేయనున్న సీఎం కేసిఆర్..

నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..

దక్ష న్యూస్, హైదరాబాద్ ఆగస్ట్ 19. ఈ నెల 25న సచీవాలయం ( secretariat ) లో నిర్మించిన ప్రార్ధనామందిరాలు గుడి, చర్చి, మసీదు లను సీఎం కేసీఆర్ ( cm kcr ) చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. సర్వమత సౌభ్రాతృత్వం పరిడవిల్లే లా సచీవాలయం ప్రాంగణంలో నిర్మించిన ప్రార్ధనామందిరాలను సర్వాంగ సుందరంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించాలని సీఎం కేసిఆర్ ఆదేశించిన నేపధ్యంలో శనివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ( vemula prashanth reddy ) అధికారులతో కలిసి ఆలయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డా.బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గుడి, మసీదు, చర్చి నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్ పూర్తయ్యాయన్నారు. ఈనెల 25న సీఎం కేసిఆర్ ప్రారంభించనున్నందున మిగిలిన చివరి దశ పనులు వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. 25న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చర్చి, రెండు మసీదులు, గుడి ప్రారంభోత్సవం జరగనున్నట్లు తెలిపారు. సీఎం కేసిఆర్ ఆదేశాల ప్రకారం సర్వమత సౌభ్రాతృత్వం పరిడవిల్లే విధంగా ప్రార్దన మందిరాలు నిర్మితం అయ్యాయని అన్నారు. గతంలో కంటే నిర్మాణాలు అద్భుతంగా ఉండాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు.

read also : సెప్టెంబర్ 2 నుండి జీహెచ్ఎంసీ పరిధి లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ..

Hospital

2300 గజాల స్థలంలో గుడి నిర్మాణం జరిగిందనీ, పనులన్నీ పూర్తయ్యాయని మంత్రి  వెల్లడించారు. శివాలయం, పోచమ్మగుడి, హనుమాన్, గణపతి ఆలయాలు ఉన్నాయని, వాటి పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. దేవాలయానికి సంబంధించిన విగ్రహాలను తిరుపతి నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తున్నామన్నారు.
యాగంతో ఈ ఆలయాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మసీదు, చర్చి కూడా ఆయా మత పెద్దల సమక్షంలో వారి మతాచారం ప్రకారం ప్రారంభించుకుంటామని అన్నారు.

తెలంగాణ అంటేనే గంగా జమునా తేహజిబ్ అని సర్వమత సమ్మెళితమన్నారు. అందుకే కేసిఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ గతంలో ఉన్న దానికంటే అద్భుతంగా వీటిని నిర్మించారని మంత్రి తెలిపారు.

read also : బిజెపి నేత త్వరలో బిఆర్ఎస్ లోకి .. కేటీఆర్ హరీష్ రావు లతో భేటీ

మంత్రి వెంట ఎమ్మెల్యే కాలే యాదయ్య, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా.మధు శేఖర్, ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతిరెడ్డి,ఎస్.ఈ సత్యనారాయణ, డి.ఈ లు దుర్గా ప్రసాద్,మోహన్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, రైతు నాయకులు కోటపాటి నర్సింహ నాయుడు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.