Read News in Telugu Language
adsdaksha

మద్యం తరలిస్తున్న లారీ బోల్తా.. సీసాల కోసం ఎగబడ్డ స్థానికులు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే 23

మద్యం తరలిస్తున్న ఓ లారీ బోల్తా పడ్డ సంఘటన గురువారం సికింద్రాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. దాంతో అది గమనించిన స్థానికులు హస్తలాఘవం చూపించి అందిన కాడికి సీసాలు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకెళితే సికింద్రాబాద్-బోయినపల్లి పరిధిలో మద్యం సీసాలతో వెళుతున్నఓ లారీ దేవరాయాంజల్లోని ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి దాదాపు రూ.32 లక్షల విలువచేసే మద్యం సీసాల బాక్సులను తీసుకొని బయల్దేరింది. కొంపల్లి ప్రాంతానికి చెందిన బసలింగప్ప ఆ లారీని నడుపుతున్నాడు.

read also : మళ్లీ టోల్ మోత…జూన్ 2 నుంచి అమలు..

Hospital

దేవరాయాంజల్లోని ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి ఆ లారీ బోయినపల్లి చెక్ పోస్ట్ సమీపంలో లిక్కర్ మార్టుకు చేరుకుంది. ఆ సమయంలోనే లారీ టైరు ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. లారీ బోల్తా పడి, మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అది గమనించిన స్థానికులు వెంటనే చేతికందిన మద్యం సీసాలను పట్టుకుని వెళ్లిపోయారు.

read also : ధరణి పెండింగ్ దరఖాస్తులు నెలాఖరులోగా పరిష్కరించండి : జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్..

మద్యం సీసాలను తీసుకోవాలనుకున్న మరికొందరిని డ్రైవర్ అడ్డుకున్నాడు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు స్థానికులను అడ్డగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

 

Leave A Reply

Your email address will not be published.