Read News in Telugu Language
adsdaksha

కాంగ్రెస్ పార్టీ లో వైఎస్ఆర్టీపీ విలీనం..హస్తం పార్టీలో చేరిన షర్మిల..

దక్ష న్యూస్, హైదరాబాద్: జనవరి 4

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్, ఖర్గే..

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ ( YSR tp ) విలీనమైంది. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ ( congress ) అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో షర్మిల ( sharmilha ) ను రాహుల్ గాంధీ పార్టీలోకి ఆహ్వానించారు.

షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా ఉన్నారు. ఈసందర్భంగా షర్మిల మాట్లాడుతూ… కాంగ్రెస్ లో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని విలీనం చేయటం సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్‌ జీవితమంతా కాంగ్రెస్‌ కోసం పనిచేశారని చెప్పారు. తాను కూడా వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే వైఎస్ఆర్ కల అని, అందుకోసం తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని తెలిపారు.

Hospital

Read also: జర్నలిస్టుల సంక్షేమానికి ఉన్నతస్థాయి సమావేశం..

అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని వై ఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయలేదని గుర్తు చేశారు.

Read also: డాక్టర్ కె.వి. కృష్ణారావు నివాసంలో మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు..

ఈ నేపథ్యంలో షర్మిలకు కాంగ్రెస్ లో కీలక పదవి దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీ చేస్తారని ప్రచారం సైతం జరుగుతున్నది. ఇదే సమయంలో కాంగ్రెస్ లో షర్మిల చేరికతో ఏపీలో రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందనే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే మంగళగిరికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. ఈ మధ్యనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక ఆయనే కాకుండా చాలామంది నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.