Read News in Telugu Language
adsdaksha

సింగాపురం ఇందిరను కలిసిన కడియం కావ్య.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 6

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగాపురం ఇందిరను వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ( revuri prakashreddy ) తో కలిసి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( kadiyam srihari ), వరంగల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య( kadiyam kavya )  హైదరాబాద్లో ఆమె ఇంట్లో కలిశారు. సింగాపురం ఇందిర ( singapuram Indira ) వారిని ఆహ్వానించి, శాలువాలతో సన్మానించారు.

Hospital

Read also: వడ్డీ రేట్లు కొనసాగింపు .. ఏడోసారి యథాతథం చేసిన ఆర్బీఐ..

తుక్కుగూడలో జనజాతర సభ కోసం స్టేషనఘన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలను తరలించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సింగాపురం ఇందిరతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చర్చించారని కాంగ్రెస్ ముఖ్య నాయకులు తెలిపారు. వాస్తవానికి సింగాపురం ఇందిరా వరంగల్ ఎంపీ టికెట్ ఆశించింది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ కడియం కావ్య దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ గూటికి చేరారు. కాగా హస్తం అధిష్టానం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. అయితే ఆమె గెలుపు కోసం సింగాపూరం ఇందిరా సపోర్ట్ చేస్తుందా అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో కడియం శ్రీహరి, కావ్య ఇందిరా ఇంటికి వెళ్ళి కలవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.

Leave A Reply

Your email address will not be published.