Read News in Telugu Language
adsdaksha

సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సీఎంపిఎఫ్ పాస్ బుక్ లు అందజేయాలి..

మణుగూరు, సెప్టెంబర్ 15, దక్ష న్యూస్ :

సింగరేణి కాలరీస్ ( singareni collieries )  కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం ( kottagudem ) రీజియన్ స్థాయిలో మణుగూరు ( manuguru ), కొత్తగూడెం ( kottagudem ), ఇల్లందు ( yellandu)  ఏరియాలలోని వివిధ గనులు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి 2023 మార్చి వరకు జమ వివరాలతో కూడిన వార్షిక సీఎంపిఎఫ్ ( cm pf ) పాస్ బుక్కులు అందజేయాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ( iftu )  ఆధ్వర్యంలో శుక్రవారం పీవి కాలనీ కమ్యూనిటీ హాల్ లో సీఎం పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ (assistant commissioner ) కనకమ్మ ( kanakamma ) కు వినతి పత్రం అందజేశారు.

read also : వైద్య విద్యలో నవశకానికి నాంది.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

Hospital

ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్.డి నాసర్ పాషా మాట్లాడుతూ 2020 -21 వార్షిక సివిల్, పర్చేజ్, పార్కులు, గెస్ట్ హౌస్ లు, స్టోర్స్ , మ్యాక్స్ సొసైటీ ఇలా ఇంకా కొంతమంది కాంటాక్ట్ కార్మికులకు సీఎంపిఎఫ్ పాస్ బుక్కుల వివరాలు అందజేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా 2021- 22,2022-23 రెండు సంవత్సరాల వార్షిక జమ వివరాలతో కూడిన పిఎఫ్ పాసుబుక్కులు కూడా త్వరగతిన పూర్తి చేసి అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

read also : టెట్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ..

అలాగే చనిపోయిన లేదా అనారోగ్యంతో పని మానివేసిన కాంటాక్ట్ కార్మికులకు సంబంధించిన పిఎఫ్ వాపస్ (రిటర్న్ ) సొమ్ము త్వరగా అందజేయాలని కోరారు. ఇటీవల కొత్తగా పనులలో చేరిన కాంటాక్ట్ కార్మికులందరికీ పిఎఫ్ నెంబర్ ఇవ్వాలని, సింగరేణి నర్సరీలు, వాషింగ్ ప్లాంట్ సిల్ట్ లిఫ్టింగ్ కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా సి ఎం పి ఎఫ్ వర్తింపజేసి, నిబంధనల ప్రకారం అమలు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న కాంటాక్ట్ కార్మికుల పెన్షన్ సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. ప్రైవేటు కన్వీనేన్స్ వాహన డ్రైవర్లకు సీఎం పిఎఫ్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏరియా అధ్యక్షులు ఎ. మంగీలాల్, కాంట్రాక్ట్ కార్మికులు బి. హాథిరామ్, కె. నాగేశ్వరరావు ఐ. గోపి, ఎస్. భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.