Read News in Telugu Language
adsdaksha

ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లకు కూడా ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలి : ఐ ఎఫ్ టి యు

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జనవరి 7

సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సింగరేణి సెక్యూరిటీ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లకు కూడా ఇతర ఏరియాలలో ఇచ్చినట్లుగా ఖాకీ యూనిఫామ్ ఇవ్వాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ( iftu ) ఆధ్వర్యంలో ఏరియా ఎస్ ఓ టు జి ఎం వీసం కృష్ణయ్యకి ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏరియా అధ్యక్షులు మంగీలాల్ మాట్లాడుతూ ఐ.ఎఫ్.టి.యు విజ్ఞప్తి మేరకు సింగరేణి వ్యాప్తంగా ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్ లకు ఉచితంగా ఖాకీ యూనిఫామ్ ఏర్పాటు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే మణుగూరులో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లకు ఖాకీ యూనిఫామ్ ఇచ్చే విషయంలో సదరు నూతన కాంట్రాక్టర్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు ఐ ఎఫ్ టి యు దృష్టికి వచ్చిందన్నారు.

read also : దేవర” గ్లింప్సెస్ విడుదల ఈ నెల 8న ..

Hospital

ఖాకీ యూనిఫామ్ వలన ఇతర ఏరియాలలో రానీ ఇబ్బందులు మణుగూరులో ఎందుకు వస్తాయని కాంట్రాక్టర్ ఊహిస్తున్నారో తమకు అర్థం కావడం లేదని మంగీలాల్ అన్నారు. ఏరియా యాజమాన్యం చొరవ చూపి మణుగూరు ఏరియాలో కూడా ప్రైవేటు సెక్యూరిటీ గార్డు లకు ఎలాంటి షరతులు లేకుండా ఖాకీ యూనిఫామ్, ఇతర వస్తువులు ఉచితంగా ఇచ్చే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు కార్పొరేట్ అధికారులకు కూడా వినతి పత్రాలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ అవతార్, సుధాకర్, ప్రభాకర్, భరత్, శ్రీను, వాసు, రబ్బాని, ప్రవీణ్, గఫార్ తదితరులు పాల్గొన్నారు.

read also : ఏ పీ అంగన్వాడీల సమ్మె పై ఎస్మా..

Leave A Reply

Your email address will not be published.