Read News in Telugu Language
adsdaksha

బిఆర్ఎస్ పార్టీ కి ఒక్క నియోజక వర్గంలో సోషల్ మీడియా వర్కర్ లు ఎంతమందో తెలుసా..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 5

సోషల్ మీడియా సైనికులతో సమావేశం నిర్వహించిన రేగా..

ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా ( social media )  ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని తెలంగాణ ( telangana ) రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ( rega kantharao ) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం ( bhadradri kottagudem ) జిల్లా మణుగూరు ( manuguru ) మండలం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మంగళవారం బిఆర్ఎస్ ( brs ) పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హాజరయ్యారు.

read also : damini : దామిని యాప్ పై అవగాహన కల్పించండి.. కలెక్టర్ వి.పి. గౌతమ్..

ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ, సోషల్ మీడియా వారియర్స్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరంతరం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అదేశించారు. బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పార్టీని మరింత అభివృద్ధి చేయడానికి సైనికుల కష్టపడాలని, కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుందని అన్నారు.

Hospital

read also : గురుపూజోత్సవంలో పాల్గొనడం గొప్ప మధురానుభూతి ..

పార్టీ వారికి ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందఅన్నారు. సోషల్ మీడియా వారియర్స్ సంక్షేమ పథకాలను గడపగడపకు చేర్చాలని రేగా అన్నారు.

read also : తెలంగాణలోని 40 బీసీ కులాలను OBC జాబితాలో చేర్చండి..

ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వేదికగా ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించాలన్నారు. ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సోషల్ మీడియాలో ఏ పార్టీకి లేనంత స్వచ్ఛంద సైనికులు బిఆర్ఎస్ కు ఉన్నారని ఆయన అన్నారు, ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసేదందుకు సోషల్ మీడియా నిరంతరం కృషి చేస్తుందన్నారు.  కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం లోని అన్ని మండలాల సోషల్ మీడియా అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్స్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.