Read News in Telugu Language
adsdaksha

బీజేపీకి రాజీనామా చేస్తా : బాబు మోహన్

దక్ష న్యూస్, హైదరాబాద్ : అక్టోబర్ 28

ఎన్నో అవమానాలు భరించాను ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని వ్యాఖ్య..

బీజేపీ కి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ఆపార్టీ సీనియర్ నేత బాబు మోహన్ ( babumohan ) స్పష్టం చేశారు. బీజేపి ( bjp ) తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు బీజేపీ నేత బాబు మోహన్ శనివారం హైదరాబాద్ ( hyderabad ) సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ( somajiguda press club ) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులకు ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Hospital

పార్టీలో నాకు చాలా అవమానాలు జరిగాయని బాబూ మోహన్ అన్నారు. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. భాజపా జాబితాలో నా పేరు లేకపోవడంతో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. నేను ఫోన్ చేస్తే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లిప్టు చేయరు. కావాలనే నన్ను పార్టీకి దూరం పెట్టారు అని బాబూమోహన్ పేర్కొన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్‌ లో తన పేరు రాకపోవడంపై బాబు మోహన్‌ స్పందించారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు బాబూమోహన్ తెలిపారు. ఎన్నికలు, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అన్నారు. త్వరలో భవిష్యత్ పై తుది నిర్ణయం తీసుకుంటానని అన్నారు. “అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసి.. మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. అర్హులకే టికెట్ ఇవ్వాలని భాజపా పెద్దలను కోరుతున్నా అన్నారు. ఆందోల్ ప్రజలు నన్ను మూడు సార్లు ఆదరించారని.. ప్రధాని మోదీ మంచి నాయకుడైనా ఇక్కడి నేతల తీరు మాత్రం సరిగ్గా లేదన్నారు బాబు మోహన్‌ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.