Read News in Telugu Language
adsdaksha

తొలిసారి రాజ్యసభకు సోనియా నామినేషన్.. రాజస్థాన్‌ నుంచి పోటీ..

దక్ష న్యూస్, న్యూఢిల్లీ : ఫిబ్రవరి 15

– రాహుల్, ప్రియాంక, అశోక్ గెహ్లాట్ హాజరు..

ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభకు నామినేషన్ వేశారు. బుధవారం రాజస్థాన్ ( rajasthan ) నుంచి రాజ్యసభకు రాహుల్ గాంధీ ( rahul gandhi ), ప్రియాంక గాంధీ ( priyanka gandhi ), అశోక్ గెహ్లాట్ ( ashok gehlot ), గోవింద సింగ్ దోస్తా ( govind singh dosta ) లతో కలిసి వెళ్ళి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇప్పటికి ఐదుసార్లు లోక్ సభ కు ఎన్నికైన సోనియా గాంధీ ( sonia gandhi ) తొలిసారి రాజ్యసభ బరిలో నిలిచారు.

Hospital

read also : గులాబీ ఎమ్మెల్యేల హై డ్రామా .. అసెంబ్లీ నుంచి వాకౌట్..

రాజస్థాన్‌లో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో ఒకటి కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకునే అవకాశాలు ఉండడంతో అక్కడినుండి సోనియా రాజ్యసభ బరిలో నిలిచారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15 కాగా, 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యుర్థిగా సోనియాగాంధీ నామినేషన్ దాఖలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.