Read News in Telugu Language
adsdaksha

సంక్రాంతికి 32 స్పెషల్ రైళ్లు.. ఇవిగో వివరాలు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 3

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకొని జనవరి 7వ తేదీ నుంచి 27 మధ్య వివిధ తేదీల్లో దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. పండగలకు సొంత ఊళ్లకు పయణమయ్యే వారి కోసం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

రూట్ల వివరాలు :

విశాఖపట్నం-కర్నూలు సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్‌, సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌, సికింద్రాబాద్‌-బ్రహ్మపుర్‌, బ్రహ్మపుర్‌-వికారాబాద్‌ రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

 

read also : అయోధ్య మహా సంప్రోక్షణ మహోత్సవానికి భారీ విరాళాలు ..

 

ప్రత్యేక రైళ్ల వివరాలు :

జనవరి 7 మరియు 14న సికింద్రాబాద్–బ్రహ్మపుర్

– జనవరి 8 మరియు 15న బ్రహ్మాపుర్ -వికారాబాద్

– జనవరి 9 మరియు 16న వికారాబాద్–బ్రహ్మపుర్

– జనవరి 10 మరియు 17న బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్

– జనవరి 10, 17 మరియు 24న విశాఖపట్నం – కర్నూలు సిటీ

– జనవరి 11, 18, 25న
కర్నూల్ సిటీ–విశాఖపట్నం

– జనవరి 12, 19 మరియు 26న శ్రీకాకుళం – వికారాబాద్
వికారాబాద్ – శ్రీకాకుళం

– జనవరి 13, 20, 27న
సికింద్రాబాద్ – తిరుపతి

Hospital

– జనవరి 10 మరియు 17న
తిరుపతి – సికింద్రాబాద్

– జనవరి 11 మరియు 18న
సికింద్రాబాద్ – కాకినాడ టౌన్

– జనవరి 12న కాకినాడ టౌన్ – సికింద్రాబాద్

– జనవరి 13న
సికింద్రాబాద్ – బ్రహ్మపుర్

– జనవరి 8 మరియు 15న
బ్రహ్మాపుర్ – సికింద్రాబాద్.

– జనవరి 9 మరియు 16న
నర్సాపూర్ – సికింద్రాబాద్

– జనవరి 10న
సికింద్రాబాద్ – నర్సాపూర్

జనవరి 11 తేదీల్లో విశాఖపట్టణం – కర్నూలు

ప్రత్యేక రైళ్లు ఈ నెల 10,11, 17, 18, 24, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.35కు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది.

– శ్రీకాకుళం–వికారాబాద్‌ స్పె షల్‌ ట్రైన్‌ ఈ నెల 12, 13, 19, 20, 26, 27 తేదీ ల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు వికారాబాద్‌కు చేరుకుంటుంది.

– సికింద్రాబాద్‌–తిరుపతి స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 10, 11, 17,18 తేదీల్లో సాయంత్రం 6.40 కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గం.కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–కాకినాడ ప్రత్యేక రైలు ఈనెల 12న రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 8.30 కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

read also : ఇక ప్రభుత్వ బడుల్లో ఫేస్ రికగ్నైజ్ అటెండెన్స్ ..ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ

– సికింద్రాబాద్‌–బ్రహ్మపుర్– వికారాబాద్‌ స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు బ్రహ్మపుర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.30గంటలకు బ్రాహ్మణ్‌పూర్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వికారాబాద్‌ చేరుకుంటుంది.

– వికారాబాద్‌–బ్రహ్మపుర్– సికింద్రాబాద్‌ స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజుఉదయం 11.15 గంటలకు బ్రహ్మపుర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.
మరిన్ని వివరాలు, రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం https://www.irctc.co.in/nget/train-search చూడవచ్చు.

Leave A Reply

Your email address will not be published.