Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం ఎస్ఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఎన్నిక ..

దక్ష న్యూస్, ఖమ్మం : పిబ్రవరి 6

స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ పూర్తిగా క్రీడాకారుల సమస్యలను తీరుస్తూ క్రీడా అబివృద్దే ధ్యేయంగా పనిచేస్తుందని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్  ( sports students federation )  స్టేట్ ఫౌండర్, ప్రెసిడెంట్ చాగంటి రాజేష్ అన్నారు. మంగళవారం
ఖమ్మం జిల్లాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీని ఎన్నుకున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోటయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి చాగంటి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడు ఉండాలని అలాగే ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు కి మినిమం శాలరీ ఇవ్వాలన్నారు.

Read also: భార‌త్ న్యాయ్ యాత్ర‌లో సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ ను కలిసిన మంత్రులు భట్టి, పొంగులేటి..

Hospital

ప్రతి విద్యార్థికి క్రీడల యెక్క విలువలను తెలియచెప్పేందుకు క్రీడల వల్ల కలిగే మానసిక శారీరక ఒత్తిడిని తగ్గించి వారిని పూర్తిగా క్రీడలపై మళ్లించే విధంగా యాజమాన్యాలు చొరవ తీసుకోవాలన్నారు. తెలంగాణ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటే ధ్యేయంగా ఈ ఫెడరేషన్ ముందుకు సాగుతుందని తెలియజేశారు.

Read also: నేడే ఆఖరు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు చివరి గడువు..

అనంతరం ఫెడరేషన్ జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ గా వి.హరీష్ , వైస్ ప్రెసిడెంట్స్ గా గణేష్, సమైక్య,
జనరల్ సెక్రెటరీ గా D. కృష్ణ,
వర్కింగ్ ప్రెసిడెంట్ గా దేవేందర్,
కో ఆర్డినేటర్ గా బలరాం,
అధికార ప్రతినిధి గా కరుణాకర్ ,
జాయింట్ సెక్రటరీ గా సుల్తాన్ ను ఎన్నుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.