Read News in Telugu Language
adsdaksha

భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్రవారం పూజలు.. వైభవంగా వరలక్ష్మి వ్రతాలు..

దక్ష న్యూస్, ఆధ్యాత్మికం. ఆగస్ట్ 25

నిజ శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు, నోములు పూజలతో తెలుగు రాష్ట్రాలు సందడిని సంతరించుకున్నాయి. ఎటు చూసినా మహిళల కొలాహలమే కనిపించింది. శ్రావణ శుక్రవారం ( sravana sukravaram ) సందర్భంగా వేకువ జామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు లక్ష్మిదేవికి ఘనంగా పూజలు జరిపారు. మహిళల సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లిగా అమ్మవారికి పసుపు కుంకుమలు, మంగళ ద్రవ్యాలు, నైవేద్యాలు భక్తితో సమర్పించారు. కొత్తబట్టలు పూలు, గాజులు సమర్పించి అమ్మదయ తమపై ఎల్లప్పుడూ ఉండాలని, తమకు సౌభాగ్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. అమ్మవారి ప్రతి రూపాలుగా తోటి మహిళలకు వాయనాలు ఇచ్చి ఆశీస్సులు అందుకున్నారు.

Hospital

read also : చందమామ పై మూన్ వాక్.. ప్రజ్ఞాన్ రోవర్ చిత్రాలు విడుదల..

శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో సామూహిక వ్రతాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయాల వద్ద మహిళలు వాయనాల సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇస్తినమ్మా వాయనం.. పుచ్చుకుంటినమ్మా వాయనం అంటూ ఒకరికొకరు వాయనాలు ఇచ్చుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

read also : పాశ్చాత్య ఆవిష్కరణలు మన వేదాల్లోనివే.. ఇస్రో శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు..

Leave A Reply

Your email address will not be published.