Read News in Telugu Language
adsdaksha

శ్రీ నల్ల పోచామ్మ దేవాలయంలో శ్రీ దేవీ నవరాత్రి వేడుకలు..

దక్ష న్యూస్, జగద్గిరిగుట్ట: అక్టోబర్ 22

జగద్గిరిగుట్ట ( jagadgiri gutta ) వెంకటేశ్వర నగర్ కాలనీ లోని శ్రీ నల్ల పోచామ్మ ( sri nallapochamma ) దేవాలయంలో శ్రీ దేవి శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మ వారు మహిషాసుర మర్ధిని అలంకరంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా తెల్ల వారు జాము నుండి అమ్మ వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ పారాయణం నిత్య పూజలను ఆలయ పూజారి భుజంగ చార్యులు నిర్వహించారు.

read also : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసిఆర్ దసరా శుభాకాంక్షలు..

Hospital

అనంతరం జరిగిన కుంకుమ పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్టొన్నారు. తమ పసుపు కుంకుమలు కలకాలం చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కుంకుమ పూజల సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా భక్తి శ్రద్దలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ధర్మ కర్తలు వై. హైమవతి, వై.హరినాథ్,సంజీవరెడ్డి, సత్యనారాయణ, యాదగిరి,శ్యామ్ రాజు,రామచంద్ర కుమార్ స్వామి, రమేష్, భీమ్ రావు,రాహుల్ ,సోమయ్య, వసంత, పావని లలిత పూజారులు భుజంగ చార్యులు,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

read also : తెలంగాణ ప్రజాప్రతినిధుల నేర చరిత్ర.. అధికార పార్టీలోనే 59 మంది..

Leave A Reply

Your email address will not be published.