Read News in Telugu Language
adsdaksha

లంబోదరుడికి 108 రకాల ప్రసాదాలతో మహా నైవేద్యం..

దక్ష న్యూస్, సత్తుపల్లి: సెప్టెంబర్ 27

భక్తి శ్రద్ధలతో దీపాలంకరణ..

వినాయక చవితి నవరాత్రోత్సవాల్లో భాగంగా సత్తుపల్లి ( sattupalli ) సిద్దారం రోడ్ లో శ్రీ సాయి గణపతి ( sri sai ganapathi ) ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడికి బుధవారం పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లంబోదరుడికి 108 రకాల మహా నైవేద్యం సమర్పించారు.

Hospital

లింగాకారంలో భక్తులు దీపాలు వెలిగించి చేసిన దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల కోలాటాలు, ఆటపాటలతో వినాయక మండపం సందడిని సంతరించుకుంది. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో చిన్నంశెట్టి శేషగిరిరావు, రాజ్యలక్ష్మి, మోదుంపురం బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

read also : బై..బై.. గణేశా..గణనాథునికి ఘన వీడ్కోలు..

Leave A Reply

Your email address will not be published.