Read News in Telugu Language
adsdaksha

శ్రీ స్థంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో గోశాలకు దాణా వితరణ..

దక్ష న్యూస్, ఖమ్మం : ఫిబ్రవరి 9

శ్రీ స్థంభాద్రి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక గొల్లగూడెం లోని ఓమ్ శ్రీకృష్ణ గోశాలకి పుష్య మాసం బహుళ అమావాస్య తిథి పురస్కరించుకొని నగర పెద్దలు, స్థానిక దాల్ మిల్ యజమానులు, గో ప్రేమికులు, సేవా సమితి సభ్యుల ద్వారా సేకరించిన రూ.57,000/-ల విలువ గల గో దాణాను అందజేశారు. చిన్నారి ఆశ్వి ( usa ) జన్మదినం సందర్బంగా రు.8,000/-విలువైన వరిగడ్డి ని స్థంభాద్రి సేవా సమితి దాతల పక్షాన వితరణ చేశారు.

Hospital

read also : ఉద్రిక్తతంగా ఉత్తరాఖండ్ .. మసీదు, మదర్సా కూల్చివేతతో రణరంగం ..

ఈ కార్యక్రమంలో సేవా సమితి కన్వీనర్ తూములూరి లక్ష్మీ నరసింహారావు, కార్యదర్శి పెనుగొండ శ్రీనివాసరావు సభ్యులు సూరినేటి మల్లేశం, పెనుగొండ సాయికుమార్, జల్లేపల్లి శ్రీరాంరావు, పి. ఉమా శంకర్, బి.రమణారెడ్డి జి. సూర్యనారాయణ, మోతుకూరి భద్రయ్య, సోమారపు సుధీర్, సుంకరి యెల్లారావు, చెరుకూరి రామారావు, పెనుగొండ రామ్మోహనరావు, కె. మురళీధర్ రావు, వి. శ్రీనివాసరావు, పసుపులేటి రాజేంద్ర ప్రసాద్ తదితరులతో పాటు గోశాల భాద్యులు చైన్సింగ్ రాజపురోహిత్ దాతలందరకు ధన్యవాదములు తెలిపారు. గో ప్రేమికులకు, దాతలందరకు అన్నప్రసాద వితరణ చేశారు.

Leave A Reply

Your email address will not be published.