Read News in Telugu Language
adsdaksha

మద్యం దుకాణాలకు 1,31,490 దరఖాస్తులు..

పారదర్శకంగా మద్యం టెండర్ల లక్కీ డ్రా..

నేడు అన్ని జిల్లా కలెక్టరేట్లలో  లాటరీలు..

టెండర్ల ప్రక్రియలో చిన్న తప్పు చేసినా అధికారులపై కఠిన చర్యలు ..

– ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్

దక్ష న్యూస్, మహబూబ్ నగర్: ఆగష్టు 20

అత్యంత పారదర్శకమైన నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం వల్ల ఎక్కడా మద్యం దుకాణాల కోసం సిండికేట్లు కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్  ( SRINIVAS GAUD ) తెలిపారు.
సమైక్య రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు, గుడుంబా, సొంతలేబిళ్ళ ద్వారా తయారు చేసే నకిలీ మద్యం, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే మద్యం వల్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉండేదని… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ( CM KCR )  ఆదేశాల మేరకు వీటన్నిటినీ కట్టడి చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని తెలిపారు. ఎక్సైజ్ టెండర్ల లక్కీ డ్రాకు సంబంధించిన ఏర్పాట్లపై మహబూబ్ నగర్ ( MAHABUBNAGAR ) లోని తమ క్యాంప్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

Hospital

ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల కోసం 131490 దరఖాస్తులు వచ్చాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సోమవారం ఉదయం 11 గంటల నుంచి అన్ని జిల్లా కలెక్టరేట్లలో వీడియో చిత్రీకరణ ద్వారా ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గెలుపొందిన వారికి వెంటనే అలాట్మెంట్ ఆర్డర్లు కూడా అక్కడే అధికారులు అందిస్తారని మంత్రి వివరించారు. లైసెన్స్ దారులు, ఎంట్రీ పాస్ ఉన్న వారికి మాత్రమే లక్కీ డ్రా నిర్వహించే ప్రాంతంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

read also : రాజమౌళిపై రేణుదేశాయ్ స్పెషల్ పోస్ట్..

టెండర్ల ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సమైక్య రాష్ట్రంలో మద్యం మీద వచ్చే ఆదాయం అక్రమ మద్యం వ్యాపారం చేసే వారి జోబుల్లోకి పోయేదని… నకిలీ మద్యాన్ని నిరోధించినందున ప్రస్తుతం ఆ ఆదాయం అంతా నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతోందని మంత్రి తెలిపారు. అక్రమ మద్యాన్ని అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తున్న అధికారులకు క్రమం తప్పకుండా పదోన్నతులు కూడా ఇస్తామని అన్నారు.

సమావేశంలో మహబూబ్ నగర్ ఎక్సైజ్ సూపరిండెంట్ సైదులు, సీఐ వీరారెడ్డి, ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

read also : రాం చరణ్ చేతుల మీదుగా జోగినిపల్లి పుస్తకం “వింగ్స్ ఆఫ్ పాషన్” ఆవిష్కరణ..

Leave A Reply

Your email address will not be published.