Read News in Telugu Language
adsdaksha

కొలంబో మంత్రిని కలిసిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 22

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బౌద్ద కేంద్రాలకు దక్షిణ ఆసియా నుండి పర్యాటకుల సౌలభ్యం కోసం శ్రీలంక (srilanka ) నుండి హైదరాబాద్‌ ( hyderabad ) కు రోజువారీ విమానాలను నడపాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ( srinivas gaud ) కొలంబో ( colombo ) లో శ్రీలంక దేశ ఓడరేవుల అభివృద్ధి, నౌకాయానం, పౌర విమనయాన శాఖ మంత్రి నిర్మల్ సిరిపాల డిసిల్వ (nirmal siripala de silva ) ని కోరారు. శ్రీలంక పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం అక్కడి మంత్రి నిర్మల్ సిరిపాల డిసిల్వ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీలంక నుండి హైదరాబాద్ కు రోజూవారీ విమాన సర్వీస్ ల గురించి చర్చించారు.

read also : సాదు కుంటరో.. సంపుకుంటరో మీ ఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..
సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్‌లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్దవనం, తెలంగాణ రాష్ట్రం లో ఉన్న టెంపుల్ టూరిజం, బౌద్ధ కేంద్రాల అభివృద్ధి తో పాటు బుద్దిజం పూర్వ వైభవానికి చేస్తున్న కృషి పై శ్రీనివాస్ గౌడ్ అక్కడి మంత్రితో చర్చించారు. రోజూ వారి విమానాలను నడపడం వల్ల చాలా మంది బౌద్ద పర్యాటకులను తెలంగాణకు తెలంగాణ కు రావడమే కాకుండా తెలంగాణ – శ్రీలంక ల మధ్య సత్ సంబంధాలు మెరుగు పరిచేందుకు ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెందిందని, తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి దేవాలయం, యునెస్కో ప్రపంచ వారసత్వం కట్టడం గా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, ప్రపంచ ప్రఖ్యాత బుద్ధవనం, భారతదేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఏకో పార్క్ తో పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలో ఉన్న 26 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మహబూబ్ నగర్ జంగల్ సఫారీ లాంటి ఎన్నో అద్భుత పర్యాటక కేంద్రాలు ఉన్నాయన్నారు.

Hospital

read also : పేదలు గొప్పగా బ్రతకాలనే ఆలోచనలకు ప్రతిరూపమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక కేంద్రంతో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని శ్రీలంక మంత్రి నిర్మల్ సిరిపాల డిసిల్వ ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజం అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యల పట్ల శ్రీలంక దేశ మంత్రి నిర్మల్ సిరిపాల డిసిల్వా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందించారు. మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి మేరకు తెలంగాణలో త్వరలో పర్యటించేందుకు సానుకూలంగా స్పందించారు.

Leave A Reply

Your email address will not be published.