Read News in Telugu Language
adsdaksha

బీఆర్‌ఎస్‌ని వదిలిపెట్టం.. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ క్లారిటీ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 20

తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( srinivas gaud ) స్పష్టం చేశారు. తాను బీజేపీ ( bjp ) లో చేరడం లేదని, బీఆర్‌ఎస్‌ ( brs ) లోనే ఉంటానని అన్నారు. పుట్టినరోజు నాడు రామమందిరానికి వెళ్లానని, కేవలం గుడికెళితే బీజేపీలో చేరుతున్నట్టా? అని ప్రశ్నించారు. ఇలాంటి అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ నాయకత్వానికి తాను ఎలాంటి వాడో తెలుసని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌ ( telangana bhavan ) లో శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు.

read also : pmegp : పీఎంఇజిపి స్కీమ్ తో యువత కలలు సాకారం..

Hospital

‘‘రాష్ట్రంలో బహుజన నాయకత్వాన్ని రాజకీయంగా అంతం చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పన్నిన కుట్రలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బహుజన నాయకులు రాజకీయంగా ఎదిగితే మనుగడ ఉండదని ఓ వర్గం భావించింది. రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ద్వారానే ప్రజానీకానికి న్యాయం జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం కేసులో కవిత అరెస్టును ఖండించారు. కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నారు. ప్రజలను అణచివేసి, అవమానిస్తే ఈ భూమిపై మరో ఉద్యమం తప్పదని అన్నారు.

read also : సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల .. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ..

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఐదేళ్ల తర్వాత మళ్లీ బీఆర్‌ఎస్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి విర్ర వీగుతున్నారన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రేవంత్‌పై క్రిమినల్‌ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ‘‘కేసీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలను విచారణ పేరుతో రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.