Read News in Telugu Language
adsdaksha

శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ పోటీ పరీక్ష ..

దక్ష న్యూస్ , ఖమ్మం: ఫిబ్రవరి 4

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నామని శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ అమరేష్, ఖమ్మం జిల్లా కో-ఆర్డినేటర్ దాసరి రమేష్ లు తెలిపారు.

Read also: 7 న ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం పై అవగాహన సదస్సు..
ఆదివారం ఖమ్మం నగరంలో గల గాయత్రి డిగ్రీ కళాశాలలో మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పోటీ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ అమరేష్, ఖమ్మం జిల్లా కో-ఆర్డినేటర్ దాసరి రమేష్ లు మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభను వెలుగు తీయడమే కాకుండా పోటీ పరీక్షలకు ఈ అనుభవము ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Read also: నీళ్ల దోపిడికి కారకుడు కేసీఆరే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తే సహించం : సీఎం రేవంత్ రెడ్డి..

Hospital

ఖమ్మంలో జరిగిన ఈ పరీక్షలకు సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుండి 874 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు.

ఈ పోటీ పరీక్షల నిర్వాహణ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ సభ్యులు చందావత్ మోహన్, బానోత్ ప్రసాద్, కమలాకర్, సైదా, నునావత్ సురేష్, కమలాకర్, మానస, రజిని, కవితలు విజయవంతగా నిర్వహించారన్నారు.

Read also: 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..

పరీక్షల నిర్వహణకు వేదికను ఇచ్చి, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించిన గాయత్రి డిగ్రీ కాలేజీ చైర్మన్ సునీల్, వండర్ కిడ్స్ స్కూల్ డైరెక్టర్ శశిధర్ రెడ్డిలకు శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.