Read News in Telugu Language
adsdaksha

book my show : బుక్ మై షో ఫ్లాట్ ఫాం మీద ఎంక్వైరీ చేయండి.. పోలీస్ అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 24

ఈవెంట్స్ ను జల్లెడ పట్టండి..ఆదాయ వనరుగా చూడకండి..

సన్ బర్న్ పార్టీకి సంబంధించి డిజిటల్ మార్గంలో కొన్ని టికెట్లు అమ్ముతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుక్ మై షో ( book my show ) లాంటి కొన్నింటిని నేను స్వయంగా గమనించానని, సైబరాబాద్ కమిషనర్ ను ఆదేశిస్తున్నా.. వాళ్లు ప్రభుత్వ అనుమతి పొందలేదు.. అనుమతి పొందకుండా 31 రాత్రి సన్ బర్న్ పార్టీ ( sunburn party ) కి సంబంధించి టికెట్టు విక్రయిస్తున్నారు.. వాటిపై ఎంక్వయిరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచీవాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, సీపీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ( cm revanthreddy ) బుక్ మై షో యాజమాన్యంపై ఫైర్ అయ్యారు. 18 సంవత్సరాలలోపు వారికి అటువంటి పార్టీల్లో అనుమతి లేదు.. అండర్ 18 వారికి మద్యం అమ్మడానికి లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా అవి దొరుకుతున్నాయన్నారు.

read also : రేవంత్ మార్క్ పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో అదిరిపోయే ప్రసంగం చేసిన సీఎం..

Hospital

బుక్ మై షో ఫ్లాట్ ఫాం ఎదైతో వుందో దానిమీద ఎంక్వైరీ చేసి, అనుమతి లేకుండా పార్టీలు చేసుకోవడాన్ని నిషేదించాలని రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసుల అనుమతి లేకుండా టికెట్లు అమ్మడానికి లేదు. వారు ఎలా అమ్ముతున్నారు. ఇట్లాంటి విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే.. గతంలో నేరగాళ్లకు ఒక విధానం వుండేది. ఇప్పుడు సైబర్ క్రైమ్ బిగ్గెస్ట్ టాస్క్.. సంప్రదాయమైన నేరాలంటారు గదా ఆ నేరాలిప్పుడు పూర్తిగా సైబర్ క్రైమ్ లొకి వెళ్లిపోయినయ్. ఇప్పటి నేరాల నేచర్ మారిపోయింది. సైబర్ క్రైమ్ నేరగాళ్లు పెరిగిపోయారు. పోలీస్ వాళ్లు ఇంకా పటిష్టతను పెంచుకోవాలి.. దీని మీద కూడా పోలీస్ అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఈవెంట్స్ ను జల్లెడ పట్టండి.. వాటిని ఆదాయ వనరుగా చూడకండి. అవి ఎలాంటి కల్చర్ పెంపొందిస్తున్నాయంటె.. యువతను పెడద్రోవకు మళ్లిస్తున్నాయి. హుక్కా సెంటర్స్, పబ్స్ లో జరిగే వ్యవహారాలు గాని, ఇట్లాంటి సన్ బార్న్ పార్టిలను గోవా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు నిషేధించాయి. ప్రస్తుతం మాత్రం చాలా కఠినంగా వ్యవహరించండి అని ఆదేశాలు జారీ చేశారు.

read also : ఇంటర్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ పై మళ్లీ కన్ఫ్యూజన్ .. ఏటా వాయిదా వేస్తున్న ఇంటర్ బోర్డు..

యువతను పెడ ద్రోవ పట్టించే కార్యకలాపాల్లో ఎంత పెద్దవాళ్లనయినా, వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏమున్నా ఎవ్వరినీ ఉపేక్షించవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవ్వరూ మాట్లాడినా.. ఎవ్వరినీ వదలాల్సని పని లేదన్నారు. ఈ విషయంలో సంపూర్ణంగా పోలిస్ అధికారులకు అధికారాలు ఇస్తున్నాను. గంజాయి ఎవోబి ప్రాంతం నుండి సప్లయ్ అవుతుందా? ఏమవుతుంది.. మన దగ్గర పండించేది చాలా తక్కువగా వుండొచ్చు.. కానీ వినియోగించేది ఎక్కువైంది. ఎవోబి ప్రాంతం నుండి మన ప్రాంతానికి ఏరకంగా వస్తుంది? ఎలా జరుగుతుందన్నది పోలీస్ అధికారులు క్షుణ్ణంగా చూడండి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒక్కటే కాదు మీరు చేసే పని.. ప్రతి జిల్లా ఎస్పీ పట్టాణాలు, మండలాల్లో గంజాయి సరఫరా ఎలా జరుగుతుందో తెలుసుకోండి.. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించండి. సమాచారాన్ని సేకరించండి. ఎవరున్నా కూడా ఎవ్వరినీ వదలడానికి వీలులేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.