Read News in Telugu Language
adsdaksha

15న వైసీపీ “బీసీ” గర్జన సభ.. ఎమ్మెల్యే బొల్లా ఆధ్వర్యంలో ఏర్పాట్లు..

దక్ష న్యూస్, వినుకొండ : ఏప్రిల్ 12

బీసీ గర్జన సభ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల15 న జరుగుతుందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి కోవూరి సునీల్ కుమార్ యాదవ్ ( Sunil Kumar yadav ) వెల్లడించారు.

వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో గురువారం బీసీ గర్జన పోస్టర్ ను బీసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీ గర్జన సభకు నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు ముఖ్య అతిధిగా హాజరవుతరానికి, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు గారి నాయకత్వంలో నిర్వహించే ఈ సభకు బీసీ వర్గానికి చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని పిలుపు నిచ్చారు.

Read also: బిర్యానీ తినడంలో మనమే ఫస్ట్.. రంజాన్‌ మాసంలో హైదరాబాద్‌ నుంచే 10 లక్షల ఆర్డర్లు..

Hospital

సోమవారం సాయంత్రం 4 గంటలకు బీసీ గర్జన సభ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. బీసీల సత్తా చాటేందుకు బీసీ లు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అన్ని అవకాశాలు కల్పిస్తూ పెద్ద పీట వేశారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నరసరావుపేట ఎంపీ సీటు బీసీ కి ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.

Read also: ఢిల్లీ ముఖ్యమంత్రికి మరో షాక్.. కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్‌ తొలగింపు ..

బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసిన పార్టీ తెలుగుదేశం అయితే, బడుగు, బలహీనవర్గాలకు, దళితులకు, మైనార్టీలకు రాజకీయంగా అవకాశం కల్పించి బీసీ లకు అండగా నిలిచిన పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు….

Leave A Reply

Your email address will not be published.