Read News in Telugu Language
adsdaksha

అంగన్ వాడీలో పేలిన కుక్కర్.. ఇద్దరు చిన్నారులకు గాయాలు…

దక్ష న్యూస్, సూర్యాపేట: ఫిబ్రవరి 6

అంగన్ వాడీ కేంద్రంలో కుక్కర్ పేలిపోయింది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ లోని అంగన్ వాడీ సెంటర్ లో సోమవారం వంట చేస్తుండగా ప్రెషర్ కుక్కర్ పేలడంతో ఇద్దరు చిన్నారులకు గాయాలు అయ్యాయి.

Read also: నేటి నుండే భారత్ రైస్.. కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.29లకే కిలో బియ్యం..

Hospital

వివరాల్లోకి వెళితే అంగన్ వాడీ కేంద్రంలో సిబ్బంది వంట చేస్తుండగా పప్పు కుక్కర్ ఒత్తిడి పెరిగి పేలిపోయింది. ఈ టైంలో అక్కడున్న మూడేండ్ల చిన్నారులు నీలం అభినవ్, కరిశ తన్సీలు గాయపడ్డారు. వెంటనే వీరిని కోదాడ హాస్పిటల్ కు తరలించారు.

Read also: విశాఖ టెస్టులో భారత్ విక్టరీ.. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో గెలుపు..

తహసీల్దార్ రవి కుమార్ దవాఖానకు వెళ్లి పిల్లలను పరామర్శించారు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కుక్కర్ పేలిన సమయంలో అక్కడ సుమారు 15 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. కుక్కర్ కాకుండా గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగి ఉంటే పెద్ద నష్టం జరిగేది తల్లిదండ్రులు వాపోతున్నారు. సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.