Read News in Telugu Language
adsdaksha

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులు మృతి..

దక్ష న్యూస్, సూర్యాపేట : ఏప్రిల్ 22

సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఓ కంటైనర్ లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించికిత్స అందిస్తున్నారు.

Read also: జూన్ 16న యూజీసీ నెట్ ఎగ్జామ్.. నోటిఫికేషన్ విడుదల.. మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..

ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Hospital

రోడ్డుప్రమాదానికి గురైన కారు నంబర్ టీఎస్ 04ఎఫ్ఏ 6894గా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారు నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అలానే ఆగి ఉన్న లారీ సిగ్నల్ వేయకుండా వాహనం నిలపడంతో ఈ ప్రమాదం జరిగిందా అనే కోణం లో కూడా పోలిసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read also: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు.. 23న ప్రత్యేక స్క్రీనింగ్, ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్..

ఇక మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం కూడా అందాల్సి ఉంది. అయితే ప్రమాదం జరిగిన విధానం చూసినట్లయితే వేగంగా కారు లారీని ఢీ కొట్టింది. లారీ భారీ లోడ్ తో ఉండటంతో కారు..దానికి కిందకు పూర్తిగా దూరిపోయింది.
ఇక రోడ్డుపై సిగ్నల్ వేయకుండా వాహనాలు ఆపొద్దని రవాణాశాఖ అధికారులు వాహదారులను హెచ్చరిస్తున్నా కూడా కొందరు ఆవేమి పట్టించుకోకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.