Read News in Telugu Language
adsdaksha

సూర్యాపేట ఆస్పత్రులకు ఆరోగ్యశాఖ నోటీసులు.. సిజేరియన్లు, అబార్షన్లు చేస్తున్నట్లు నిర్ధారణ…

దక్ష న్యూస్, సూర్యాపేట: మార్చి 22

ప్రసవం కోసం ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు కోత తప్పడం లేదు. డబ్బులు దండుకోవడానికి అలవాటు పడిన ఆసుపత్రులు అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్ ప్రసవాలు చేస్తున్నారు. లక్షల రూపాయలను బిల్లుల రూపంలో వసూలు చేస్తున్నారు. పరిస్థితిని బట్టి గర్భిణి ఏదో సమస్య వచ్చిందని భయపడి ఆపరేషన్ వైపు మొగ్గు చూపుతుంది. దీంతో పలు ఆసుపత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ చేయించుకున్న మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

Read also: నెహ్రూ చైనాకు దగ్గరవ్వడంతోనే అమెరికాతో చెడ్డది.. కేంద్రమంత్రి జైశంకర్ సంచలన కామెంట్స్..

సాధారణ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నా సిజేరియన్‌ చేస్తున్నారనే అనుమానంతో ఆరోగ్య శాఖ అధికారులు పలు ఆసుపత్రుల్లో వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలో అత్యధికంగా సిజేరియన్‌ ప్రసవాలు జరుగుతున్న ఆసుపత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాలు, అబార్షన్‌లకు సంబంధించిన రికార్డులను అధికారులు సీజ్ చేశారు.

Hospital

Read also ఉపవాస దీక్షలో కవిత.. గీతాపఠనం, యోగా చేసిన ఎమ్మెల్సీ..

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ఆసుపత్రులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కోట చలం నోటీసులు జారీ చేశారు.

సిజేరియన్‌ ప్రసవాలు జరుగుతున్నాయన్న అనుమానంతో సోదాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 8 ఆసుపత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాలు జరిగినట్లు గుర్తించారు. సిజేరియన్లు తగ్గించి సాధారణ ప్రసవాలు పెంచాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా కొన్ని ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు.

Leave A Reply

Your email address will not be published.