Read News in Telugu Language
adsdaksha

ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ..

మణుగూరు, సెప్టెంబర్ 21, దక్ష న్యూస్:

మణుగూరు ( manuguru ) మండలం కూనవరం ( kunavaram ) గ్రామపంచాయతీలో గురువారం స్థానిక సర్పంచ్ ఎన్నిక ప్రసాద్ అధ్యక్షతన మహిళా స్వచ్ఛతాహి సేవా ( swachhata hi seva )  కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల ఎంపీ ఓ పల్నాటి వెంకటేశ్వరరావు , జిపి కార్యదర్శి ఈ. సంధ్య రాణి ఆధ్వర్యంలోమహిళా సమైక్యత సంఘాలతో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ప్రతి మహిళ తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

Hospital

తమ ఇంటి లోపల కిచెన్ గదిలో నుండి ఇంటి బయట వరకు వచ్చే చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేయాలని తడి పొడి చెత్తను వేరు చేయడం వలన దానివల్ల కలిగే లాభనష్టాలను గురించి వారికి వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో పలు వీధులలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీలు తాటి సరిత ,జిల్లా ఎంపీటీసీల ఫోరం కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు, మహిళా సంఘాల బుక్ కీపర్లు, ఏఎన్ఎం హెచ్ లక్ష్మి, ఆశా వర్కర్ వై. నర్సులమ్మ తదితరులు పాల్గొన్నారు.

read also : సాదు కుంటరో.. సంపుకుంటరో మీ ఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

Leave A Reply

Your email address will not be published.