Read News in Telugu Language
adsdaksha

స్వామి వివేకానంద జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలి ..

దక్ష న్యూస్, దేవరకద్ర: జనవరి 12

నేటి యువతకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర మానసిక ధైర్యాన్ని, మనోబలాన్ని, పోరాట స్ఫూర్తిని, దేశం పట్ల అంకితభావాన్ని, ఇస్తుందని ఆయనను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు యువతకు పిలుపునిచ్చారు.

దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగానివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రావు మాట్లాడుతూ, యువత వివేకానందుడి బాటలో ముందుకుసాగాలన్నారు.

read also : దేశాభివృద్ధికి యువత ప్రయత్నాలను ప్రోత్సహించాలి ..

Hospital

సామాజికవేత్త షేక్ అబ్దుల్ జాంగిర్ మాట్లాడుతూ యువతీ యువకులు, విద్యార్థి దశ నుండే, స్వామి వివేకానంద మార్గంలో పయనించాలని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివేకానంద జయంతి సందర్భంగా ముగ్గుల పోటీలు వ్యాసరచన పోటీలు,నిర్వహించారు. ముగ్గుల పోటీలో సంక్రాంతి పండుగ సందడిని కళ్ళకు కడుతూ విద్యార్థినిలు రంగురంగుల ముగ్గులు వేశారు. వ్యాసరచన పోటీ వివేకానందుడి జీవిత చరిత్ర యువతకు ఆదర్శం అనే అంశంపై నిర్వహించారు. విజేతలకు బహుమతులు గణతంత్ర దినోత్సవం రోజు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

read also : ఖమ్మం లో మార్కెటింగ్ శాఖా మంత్రి విస్తృత పర్యటన..

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కిస్టన్న, మాజీ ఎంపిటిసి ఆంజనేయులు, జహంగీర్, జయన్న, సాంబశివుడు, సుమన్ మహారాజ్, కే సునీత, ఫాతిమా, దత్త ప్రసాద్, శ్యాం ప్రసాద్, అనిల్ కుమార్, రవికుమార్, స్వామి, అంజిలమ్మ, రమాదేవి విద్యార్థులు, ఎల్లప్ప గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.