Read News in Telugu Language
adsdaksha

పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ స్వప్నిక రేహ పౌండేషన్ అధ్వర్యంలో అవగాహన సదస్సు..

దక్ష న్యూస్, హైదరాబాద్ ఆగస్ట్ 17 :

స్వప్నిక రేహ పౌండేషన్ పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ (Swapnika Reha Foundation Pulse Heart chainibuble Trust) అధ్వర్యంలో గురువారం ఖైరతాబాద్ ( Khairatabad ) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree college) లో గుండె సంబంధిత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిపీఆర్ ( CPR )పైన విద్యార్థినీ -విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ( Pulse Heart Super Speciality Hospital ) మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ ( Dr.M.S.S Mukherjee ) హాజరై గుండెకి సంబంధించిన అంశాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మన గుండెను ఎలా ప్రభావితం చేస్తాయో తెలియజేశారు. తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. విద్యార్థులు తమ సందేహాలను డాక్టర్ ని అడిగి నివృత్తి చేసుకున్నారు.

 

Hospital

సంస్థ కో ఆర్డినేటర్ చందు శ్రీనివాస్ (Chandu Srinivas) పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ (PULSE HEART CHARITABLE TRUST) చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్తులో కూడ “Swapnika Reha Foundation” తో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ ( College Principal ) రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇది చాలా మంచి కార్యక్రమం అని ఇక ముందు కూడా సి పి ఆర్ అవేర్నెస్ ప్రోగ్రాం ( CPR awareness programmes ) ప్రతీ నెలకి ఒకటి అయిన నిర్వహించేలా చూస్తామని చెప్పారు. స్వప్నిక రేహా పౌండేషన్, పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ సేవలను అభినందించారు.

 

కార్యక్రమంలో Dr. SAI TEJA CHOUTI “CPR” పైన అవగాహన తరగతులు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఉదాహరణలతో వివరించారు. ఈ కార్యక్రమంలో స్వప్నిక రేహ పౌండేషన్ పౌండర్ మహాలక్ష్మి ( Swapnika Reha Foundation Founder Mrs. Mahalakshmi ) సంస్థ సభ్యులు కూరు శ్రీనివాసరావు, ఏం ఎస్ తనిస్క, కొండలరావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ , Zoology Department- HOD Mrs. Suprabha, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.