Read News in Telugu Language
adsdaksha

cm kcr : గాంధీ మార్గంలో ఉద్యమించడం వల్లే రాష్ట్ర స్వప్నం సాకారమైంది..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 1

నల్లజాతి ప్రజల పోరాటాలకు గాంధేయవాదమే ఆదర్శం..

అహింసావాదం నుండి వచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష అనే ఆలోచన..

30 లక్షల మంది విద్యార్థులకు మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని చూపించాం..

గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వెనుక గాంధీ ప్రభావమే ..

– స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో సీఎం కేసిఆర్..

గాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ ( telangana ) రాష్ట్ర స్వప్నం సాకారమైందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ( swatantra bharat vajrotsavam ) ముగింపు వేడుకలు శుక్రవారం హైదరాబాద్ ( hyderabad ) హెచ్ఐసిసి ( hicc) లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅథితిగా సీఎం కేసిఆర్ ( cm kcr ) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన అందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.

 

ఇది చాలా విశిష్టమైన సందర్భం అని, స్వాతంత్ర్య పోరాట చరిత్రనీ, స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవటం ప్రతి భారతీయుని బాధ్యత అని వొక్కాణించారు. స్వాతంత్రోద్యమ స్పూర్తితో గాంధీ మార్గంలో రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లే తెలంగాణ స్వప్నం సాకారమైందని సీఎం కేసిఆర్  తెలియజేశారు.

read also : వాషింగ్టన్ డీసిలో తెలంగాణ మంత్రి.. మన గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించాయి. .

ప్రపంచ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప నాయకుల్లో మహాత్మా గాంధీ అగ్రగణ్యులు అని సీఎం కేసిఆర్ అన్నారు. యుద్ధాలతో కొట్టుకుచస్తున్న మానవ జాతికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన కొత్త ఆయుధాలను పరిచయం చేశారన్నారు. గాంధీజీ చరఖా చేత బట్టి నూలు వడికినా, చీపురు పట్టుకొని మురికి వాడలు శుభ్రం చేసినా, ఉప్పు వండినా, ఉపవాస దీక్ష చేసినా బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయేదన్నారు. ‘‘ ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్ ’’ అంటూ మత సామరస్యం కోసం యావజ్జీవం పోరాడిన గాంధీజీ చివరికి మతోన్మాద శక్తుల చేతుల్లోనే హత్యకు గురికావడం చారిత్రిక విషాదం అని వ్యాఖ్యానించారు. గాంధీజీ ఒక్క భారతదేశం మీదనే కాదు, యావత్ ప్రపంచం మీద గొప్ప ముద్ర వేశారన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ నుంచి, నెల్సన్ మండేలా వరకు నల్లజాతి ప్రజల పోరాటాలకు గాంధేయవాదమే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.

 

నేటికీ యావత్ ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తున్నదని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు. గాంధీ చూపిన అహింసామార్గంలో స్వాతంత్రోద్యమం విజయతీరం చేరిందని, స్వాతంత్ర సమర ఆశయాల వెలుగులోనే అంబేద్కర్ మహాశయుడు భారత రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆధునిక విలువలకు వేదికగా నిలుస్తున్నదని తెలిపారు. గాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందని తెలిపారు.

Hospital

read also : voa : వీ వో ఏ లకు ముఖ్యమంత్రి రాఖీ పండుగ కానుక..

ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేదని సీఎం తెలిపారు. టీఆర్‌ఎస్‌ను స్థాపించినపుడు అహింసాయుత ఉద్యమం ద్వారా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని నేను స్పష్టంగా ప్రకటించానని గుర్తు చేశారు. మొదట కొందరు తనతో ఏకీభవించలేదని, కానీ రానురాను అందరూ నేను ఎంచుకున్న మార్గమే సరైనదని అంగీకరించి నా వెంట నడిచారన్నారు. ప్రాణాన్ని పణంగా పెట్టయినా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప, అహింసామార్గాన్ని వీడకూడదని నేను నిర్ణయించుకున్నానని ఆ నేపథ్యంలోంచి వచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష అనే ఆలోచన అని తెలియజేశారు.

 

స్వతంత్ర పోరాటకాలంలో బ్రిటిష్ పాలనే బాగుందని అన్న ప్రబుద్ధుల వంటివారు… తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఉన్నారని కేసిఆర్ తెలిపారు. వారు తెలంగాణ వద్దు.. సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. మన చిత్తశుద్ధి ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలం కాక తప్పలేదన్నారు. విచిత్రం ఏమిటంటే… వాళ్లే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమం ఆదర్శవంతమైనది అయినట్టే.. తెలంగాణ పరిపాలన కూడా స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణమైనదే అని తెలిపారు.

స్వతంత్ర భారతంలో ఏనాడూ లేని విధంగా వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించామని సీఎం కేసిఆర్ అన్నారు. రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతన్నల కళ్ళలో వెలుగులు చూస్తున్నామన్నారు. గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వయంపోషకత్వం దిశగా మనం ఎంతో దూరం ప్రయాణించాం గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహమిచ్చాం. గ్రామాలు సుసంపన్నంగా మారాయి. ప్రజలందరికీ మంచినీళ్ళు కూడా ఇంతకాలం ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. సంక్షేమానికి అగ్ర తాంబూలమివ్వడంలోనూ, రైతు కేంద్రంగా ప్రణాళికల రచన చేయడంలోనూ, గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వెనుక గాంధీ ప్రభావమే ఉన్నదన్నారు. భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదని గాంధీ పదే పదే చెప్పారని, ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నాం అని పేర్కొన్నారు.

read also : voa : వీ వో ఏ లకు ముఖ్యమంత్రి రాఖీ పండుగ కానుక..

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 30 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని చూపించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని సీఎం కేసిఆర్ అన్నారు. సమాచార ప్రజా సంబంధాల శాఖ, విద్యాశాఖల అధికారులు, సిబ్బంది ఈ పనిని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని వారిని అభినందించారు. భారతదేశం మానవజాతి ఆవిర్భావ వికాసాలకు, ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక తాత్విక చింతనకు, ఉన్నతమైన నాగరికతకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లని సీఎం తెలిపారు. అతి ప్రాచీనకాలంలోనే యావత్ ప్రపంచానికీ మార్గదర్శిగా నిలిచిన ఘనత మన భారతదేశానిదన్నారు.

 

బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం సాగిన వీరోచిత స్వాతంత్ర్య సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచిపోయిందని, అనేక మంది మేధావులు దేశ ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించారన్నారు. స్వామి వివేకానంద భారత దేశ ఔన్నత్యాన్ని వివరించడం వల్ల భారతీయులలో జాతీయ స్పృహ రగిలిందన్నారు. బ్రిటిష్ పాలన మన దేశానికి లాభదాయకమని, బ్రిటిషర్లు మన దేశాన్ని ఉద్ధరిస్తున్నారని నమ్మే దురాలోచనాపరులు ఆనాడు కూడా ఉండేవారు. విభిన్న సంస్కృతుల కలయిక అయిన భారతదేశాన్ని ఒక్కతాటి మీద నిలబెట్టింది స్వాతంత్ర సమరమే అని వెల్లడించారు. ఆనాడు మహత్మాగాంధీ వంటి మహనీయులు ఎంతో శ్రమకోర్చి దేశ ప్రజలందరిలోనూ భారతీయ భావనను పాదుకొల్పారన్నారు.

read also : ప్రగతి భవన్ లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు..

రెండు శతాబ్దాల పరాధీనత నుండి విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర సమరంలో ఎంతో నెత్తురు ధారపోయాల్సి వచ్చిందని, ఎందరో ప్రాణాలను బలిపెట్టవలసి వచ్చిందన్నారు. చిరునవ్వుతో ఉరికంబమెక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వంటి అనేకమంది వీరుల త్యాగం భారత జాతి తలపులలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందన్నారు. ‘‘మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను’’ అని పిలుపునిచ్చి సుభాష్ చంద్రబోస్ సాయుధ సమరాన్ని నడిపారని,
సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటికీ మనందరికీ గొప్ప ప్రేరణనిస్తుందన్నారు.

కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కేశవరావు,
మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకిరణ్ రెడ్డి, తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస యాదవ్, జి జగదీష్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు సంస్థల చైర్మన్లు, సిఎం ఓ అధికార్లు, ప్రభుత్వ సలహాదారు లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిల్లా పరిషత్ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, ఎ ఐ ఎస్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.