Read News in Telugu Language
adsdaksha

యోధుడిగా నిఖిల్ సిద్దార్థ..

దక్ష సినిమా న్యూస్ :

ఇప్పటి వరకు ఆధ్యాత్మిక, చారిత్రక చిత్రాలంటే గుర్తొచ్చేది స్టార్ హీరోలే. కార్తికేయ 2 తో పాన్ ఇండియా సక్సెస్ అందుకొని దూసుకుపోతున్న హీరో నిఖిల్ సిద్దార్థ ఇక ఆరెంజ్ లో కనిపించబోతున్నాడు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న స్వయంభు ( swayambhu) సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నాడు. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అసలు నిఖిల్ లాంటి హీరో నుంచి ఇలాంటి సినిమా ఎవరూ ఊహించలేదనే టాక్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. అయితే ఇప్పటికే స్వయంభు నుంచి రిలీజ్ అయిన ఒక పోస్టర్ లో నిఖిల్ యోధుడి గెటప్ తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే స్వయంభు నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు.

Hospital

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ(Nikhil Siddhartha) కార్తికేయ 2తో(Karthikeya 2) పాన్ ఇండియా సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నాడు. జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల Spy సినిమా లో పర్వాలేదనిపించారు. దీని తర్వాత నిఖిల్ చేతిలో మరో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నట్లు తెస్తోంది. అందులో స్వయంభు ఒకటి. ఇటీవల నిఖిల్ పుట్టిన రోజు నాడు స్వయంభు సినిమాని మేకర్స్ ప్రకటించారు.

తాజాగా నేటి నుంచి స్వయంభు సినిమా షూటింగ్ మొదలైందని ప్రకటిస్తూ నిఖిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. యుద్ధభూమిలో బాణాలు వదులుతున్న నిఖిల్ పోస్టర్ సోషల్ మీడియా లో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Leave A Reply

Your email address will not be published.