Read News in Telugu Language
adsdaksha

t 20 : టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ..

దక్ష న్యూస్, క్రీడలు : జనవరి 5

టీ20 ప్రపంచకప్ 2024 మెగా టోర్నీ షెడ్యుల్ వివరాలను ఐసీసీ ప్రత్యేక కార్యక్రమం ద్వారా శుక్రవారం వెల్లడించింది. ఆయా దేశాల అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ లైవ్ ద్వారా ఈ షెడ్యూల్‌ వివరాలను అభిమానులతో పంచుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 దేశాల మధ్య ఈ టీ20 ( t 20 ) ప్రపంచకప్ జరగనుంది. అగ్రరాజ్యం అమెరికా ( america ) తో పాటు వెస్టిండీస్ ( west indies ) ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.

– గ్రూప్‌-ఏ: భారత్, పాకిస్థాన్‌తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ.

– గ్రూప్-బి‌: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్‌లాండ్, ఓమన్.

– గ్రూప్-సీ: న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండ, పపువా న్యూగెనియా.

-గ్రూప్-డీ: సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు తలపడనున్నాయి.

Hospital

read also : నూతన హై కోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ..

జూన్ 1 నుంచి 18 వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనుండగా, నాలుగు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8 అర్హత సాధిస్తాయి. జూన్ 19 నుంచి 24 వరకు సూపర్ 8 మ్యాచ్‌లు జరగుతాయి. టాప్-4లో నిలిచిన జట్లు జూన్ 26 (గయానా), 27(ట్రినిడాడ్) తేదిల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడతాయి.

జూన్ 29న బార్బోడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

అగ్రరాజ్యం అమెరికా, కెనడా మధ్య ఈ జూన్ 1న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుంది.

భారత్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా ఆడనుంది. జూన్ 9న దాయాదీ పాకిస్థాన్‌తోనే న్యూయార్క్ వేదికగా భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. జూన్ 12న న్యూయార్క్ వేదికగానే ఆతిథ్య అమెరికాతో తలపడనుంది. జూన్ 15న కెనడాతో ఫ్లోరిడా వేదికగా చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

గ్రూప్ స్టేజీలో టీమిండియా షెడ్యూల్:
– జూన్ 5: ఐర్లాండ్
– జూన్ 9: పాకిస్తాన్
– జూన్ 12: యూఎస్ఏ
– జూన్ 15: కెనడా జట్లతో మ్యాచ్ లు జరగనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.