Read News in Telugu Language
adsdaksha

వేసవి సెలవుల్లో ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న తాజ్ మహల్ ఎగ్జిబిషన్..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 15

మండుతున్న ఎండలకు అల్లాడుతున్న ఖమ్మం, పరిసర ప్రాంత ప్రజలను చల్లని సాయంత్రం వేళల్లో సెదదీర్చేందుకు ఖమ్మం నగరంలో తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ( taj mahal exhibition ) కొలువుదీరింది. ఖమ్మం ( khammam ) బోనకల్ రోడ్ ఆదూరి గోపి రెడ్డి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో చిట్టిపొట్టి చిన్నారులను ఆనందోత్సాహాల్లో ఓలలాడించే రెయిడ్స్ తోపాటూ పెద్దలకు, యువతీ యువకులకు అన్ని వయసుల వారిని మైమరపించే 30 రకాల లేటెస్ట్ అమ్యుజ్ మెంట్ రైడ్స్ ఏర్పాటు చేశారు. దాంతో సాయంత్రం అయిందంటే చాలు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సమేతంగా తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ను సందర్శించి తమ వయసును మరచి పిల్లలతో పోటీ పడి మరీ రైడ్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఎర్రకోట సెట్టింగ్ తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ముఖద్వారంలోనుండి లోపలికి అడుగుపెట్టిన సందర్శకులకు ఆగ్రాలో అడుగు పెట్టామా అని అనుభూతిని కలిగించేలా కళ్లఎదుట దర్శన మిచ్చే తాజ్మహల్ సెట్టింగ్ సందర్శకులను ఆనందోత్సాల్లో ముంచెత్తుతోంది. నిజమైన తాజ్ మహల్ ను తలపించేలా ఏర్పాటు చేసిన సెట్టింగ్ వద్ద పిల్లలు పెద్దలు సెల్ఫీలు దిగుతూ సంబర పడుతున్నారు. అతేకాదు చుట్టూ ఏర్పాటు చేసిన వాల్ పై అలనాటి షాజహాన్ ముంతాజ్ ల చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి.

read also : బహు ముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఆయేషా సుల్తానా ..

మరో అడుగు ముందుకేస్తే.. చిన్నారులకోసం ఏర్పాటు చేసిన మోటర్ సైకిల్,
బేబీ ట్రైన్, కార్ రైడ్స్ ఎంతో ఆకట్టుకుంటుంన్నాయి. పెద్దలకోసం ఏర్పాటు చేసిన జైయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్ వంటి వాటిలో వయసు తారతమ్యం లేకుండా ఎంజాయ్ చేస్తూ నవ్వుల్లో మునిగి తేలుతున్నారు.

Hospital

నోరూరించే తినుబండారాల స్టాల్స్..

ఎగ్జిబిషన్ సందర్శకులను ఓ వైపు స్సెషల్ అమ్యుజ్ మెంట్ రైడ్స్ ఆనంద డోలికల్లో తేలియాడిస్తుంటే మరో వైపు నోరూరించే తినుబండారాల స్టాల్స్ రారామ్మని ఆహ్వానిస్తున్నాయి. అతి పెద్ద ఢిల్లీ మసాలా పాపడ్ నుండి స్టార్ట్ చేస్తే.. చల్ల చల్లని ఐస్ క్రీం లు, వైరైటీ షోడాలు, సిమ్లా మిర్చి బజ్జీలు, ప్రత్యేక పానీ పూరీలు, వివిధ వైరైటీల నూడుల్స్, మంచూరియా వంటి ఆహార పదార్థాలు కొత్త రుచులు పంచుతున్నాయి.

read also : ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల కృతజ్ఞత లేఖ.. .

ప్రత్యేక ఆకర్షణగా షాపింగ్ స్టాల్స్..

ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో మహిళలకోసం ఏర్పాటు చేసిన బ్యాంగిల్ స్టాల్ మగువల మనసులు దోస్తోంది. చిన్నారుల నుండి పెద్దవారి వరకు అన్ని వయసుల వారికి అవసరమైన మట్టిగాజులు, మెటల్, త్రెడ్ వర్క్ బ్యాంగిల్స్, ముత్యాలు, రంగురంగుల రాళ్ళతో పొదిగిన డిజైనర్ బ్యాంగిల్స్ చూపుతిప్పుకోనివ్వడంలేదు. వాటికి తోడు డిజైనర్ బ్రాస్ లెట్స్, చెవి దిద్దులు, రింగ్ లు, హ్యాంగింగ్స్, వివిధ రకాల హారాలు, చెయిన్ లు గోల్డ్, బ్లాక్ మెటల్, వైట్ మెటల్, రోజ్ మెటల్ లో మహిళల్సి విశేషంగా ఆకట్టుకుంటుంన్నాయి.

 

Leave A Reply

Your email address will not be published.